తెలంగాణ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన రేవంత్ రెడ్డికి పలువురు నేతలు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఈ క్రమంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ తెలియజేశారు. తెలంగాణ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన రేవంత్ రెడ్డికి శుభాకాంక్షలు అని తెలిపారు. అంతేకాకుండా.. రేవంత్ రెడ్డి మంత్రివర్గ సహచరులకు శుభాభినందనలు చెప్పారు. ఈ సందర్భంగా ఓ ప్రకటన విడుదల చేశారు.
Read Also: Jeevan Reddy: మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి మాల్కు నోటీసులు
రేవంత్ రెడ్డితో తనకు వ్యక్తిగతంగా స్నేహం ఉందని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. తెలంగాణలో యురేనియం తవ్వకాలను వ్యతిరేకిస్తూ నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో రేవంత్ పాల్గొన్నారని, అంతేకాకుండా.. కాంగ్రెస్ పార్టీ అభిప్రాయాన్ని సూటిగా వెల్లడించారని పవన్ గుర్తుచేశారు. వాగ్ధాటి, ప్రజాకర్షణ కలిగిన ఆయన.. రాజకీయంగా ఎన్నో ఒత్తిళ్లను ఎదుర్కొంటూ పోరాటాలు చేసి ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగారని ప్రశంసించారు.
తెలంగాణలో జరిగిన ఉద్యమాలు, వాటి నేపథ్యాలపై సంపూర్ణ అవగాహన ఉన్న నాయకుడు రేవంత్ రెడ్డి అని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. నీళ్ళు, నిధులు, నియామకాలు.. ప్రధాన అంశాలుగా పోరాడి సాధించుకున్న రాష్ట్రం తెలంగాణ.. రాష్ట్ర సాధన కోసం అమరులైన యువత.. ఏ ఆశయాల కోసం ఆత్మ బలిదానాలు చేసిందో వాటిని సంపూర్ణంగా నెరవేర్చి ఆ త్యాగాలకు గౌరవాన్ని, సార్థకతను కల్పించాలి.. రాష్ట్ర ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా సంక్షేమం, అభివృద్ధితో తెలంగాణ రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.
తెలంగాణ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన శ్రీ @revanth_anumula గారికి శుభాకాంక్షలు – JanaSena Chief Shri @PawanKalyan#TelanganaCM#RevanthReddy pic.twitter.com/Q4mvl2Ux9O
— JanaSena Party (@JanaSenaParty) December 7, 2023