Pawan Kalyan: ఎవరి కళ్లలో ఆనందం కోసం అర్చకుడిపై దాడి.. పవన్ సూటి ప్రశ్న
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pawan Kalyan: పశ్చిమ గోదావరి జిల్లాలో పంచారామాల్లో ఒకటైన భీమవరం శ్రీ సోమేశ్వర స్వామివారి ఆలయంలో అర్చకుడిపై ఓ వ్యక్తి దాడికి తెగబడిన ఘటనపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పందించారు. ఎవరి కళ్లలో ఆనందం కోసం అర్చకుడిపై దాడి చేసి యజ్ఞోపవీతాన్ని తెంచారని ఆయన ప్రశ్నించారు. పంచారామ క్షేత్రంలో అర్చకుడిపై దాడి చేసిన వాళ్లపై కఠిన చర్యలు తీసుకోవాలని పవన్ డిమాండ్ చేశారు. సోమేశ్వర స్వామివారి ఆలయంలో అర్చకుడిపై వైసీపీ నాయకుడు దాడికి తెగబడి యజ్ఞోపవీతాన్ని తుంచేయడం పాలక వర్గం అహంభావానికీ, దాష్టీకానికి ప్రతీక అంటూ తీవ్రంగా మండిపడ్డారు.
Also Read: Ambati Rambabu: చంద్రబాబు తప్పు వల్లే పోలవరం ప్రాజెక్టు ఆలస్యం.. అంబటి సీరియస్
Also Read
- India-Meta: మా చట్ట ప్రకారం నడవాల్సిందే.. మెటాకు కేంద్రం వార్నింగ్
- 2027 World Cup: వన్డే వరల్డ్ కప్‌కు కౌంట్ డౌన్ స్టార్ట్.. షెడ్యూల్ ప్రకటించిన ఐసీసీ.. ఈ తేదీల్లోనే..
- Burning of Ganja: రూ. 3.50 కోట్ల విలువైన గంజాయి దహనం.. ఎక్కడంటే..
- UPI Charges Bill: UPI చెల్లింపులపై ఛార్జీలకు గ్రీన్ సిగ్నల్.. లోక్‌సభలో కీలక బిల్లు ఆమోదం
ఆలయ సహాయ అర్చకుడు పండ్రంగి నాగేంద్ర పవన్‌పై ఆలయ బోర్డు ఛైర్మన్ భర్త యుగంధర్ చేసిన దాడిని సనాతన ధర్మంపై దాడిగా భావించి ప్రతి ఒక్కరూ ఖండించాలన్నారు. వైదిక ఆచారాల్లో యజ్ఞోపవీతాన్ని అత్యంత పవిత్రంగా భావిస్తామని.. వేదాలు చదివి భగవంతుని సేవలో ఉండే అర్చకులపై దాడి చేయడం, వారిని ఇబ్బందిపెట్టడం రాక్షసత్వమే అన్నారు. ప్రశాంతంగా పవిత్రంగా ఉండాల్సిన ఆలయ ప్రాంగణాల్లో అహంకారం, అధికార దర్పం చూపడం క్షమార్హం కాదన్నారు. అన్నవరంలో పురోహితులను వేలం వేయాలని ఒక అర్థం లేని నిర్ణయం తీసుకున్నారని, జనసేన తీవ్రంగా వ్యతిరేకించేసరికి వెనక్కి తగ్గారని పవన్ కళ్యాణ్ అన్నారు. ఇప్పుడు పంచారామ క్షేత్రంలో అర్చకుడిపై దాడికి తెగబడ్డారన్నారు. ఇది స్థానిక నాయకుడు చేసిన దాడిగా సరిపుచ్చలేమన్నారు. ఎవరి కళ్ళలో ఆనందం కోసం అర్చకుడిపై దాడి చేసి, పవిత్ర యజ్ఞోపవీతాన్ని తెంచేశారో ఆ పరమేశ్వరుడికే తెలియాలన్నారు. ఈశ్వరుని సన్నిధిలో దాడి చేసిన వ్యక్తిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. ఈ ఘటనతో పాటు రాష్ట్రంలో హిందూ ఆలయాల నిర్వహణలో ప్రభుత్వ వైఖరి గురించి, ఆలయాలపై దాడులు గురించి కేంద్రానికి నివేదిక అందిస్తామని పవన్ పేర్కొన్నారు.
తాజావార్తలు
-
India-Meta: మా చట్ట ప్రకారం నడవాల్సిందే.. మెటాకు కేంద్రం వార్నింగ్
-
2027 World Cup: వన్డే వరల్డ్ కప్‌కు కౌంట్ డౌన్ స్టార్ట్.. షెడ్యూల్ ప్రకటించిన ఐసీసీ.. ఈ తేదీల్లోనే..
-
Burning of Ganja: రూ. 3.50 కోట్ల విలువైన గంజాయి దహనం.. ఎక్కడంటే..
-
UPI Charges Bill: UPI చెల్లింపులపై ఛార్జీలకు గ్రీన్ సిగ్నల్.. లోక్‌సభలో కీలక బిల్లు ఆమోదం
-
The Paradise Teaser Review: నాని ‘ది ప్యారడైజ్’ టీజర్ రివ్యూ.. మాస్ అవతార్‌తో రచ్చ చేసిన న్యాచురల్ స్టార్!
ట్రెండింగ్
-
రూ.9.99 లక్షలకే పెట్రోల్, డీజిల్, CNG ఆప్షన్లతో Tata Nexon Camo ఎడిషన్ లాంచ్..!
-
6.99 అంగుళాల 120Hz OLED డిస్‌ప్లే, 8,000mAh బ్యాటరీతో REDMI Note 17 5G లాంచ్..!
-
Crispy Wheat Flour Snacks: బయటి జంక్ ఫుడ్‌కి బై..బై.. ఇంట్లోనే గోధుమపిండితో కరకరలాడే హెల్తీ స్నాక్స్ చేసేయండి ఇలా.!
-
Best EV Bikes: బెస్ట్ మైలేజ్, అదిరే ఫీచర్లతో రూ.1.50 లక్షలలోపు కొనుగోలు చేయగల టాప్-5 EV బైక్‌లు ఇదిగో..!
-
Incredible Story: దేశవాళీ క్రికెట్లో 9 వేల రన్స్.. టీమిండియా డెబ్యూలోనే హాఫ్ సెంచరీ.. కానీ అడ్రస్ లేకుండా పోయిన ఓపెనర్!