NTV Telugu Site icon

Pawan Kalyan: నాకు కొడాలి నానిని తిట్టాలని ఏమీ లేదు.. కానీ..!

Pawan

Pawan

Pawan Kalyan: మాజీ మంత్రి, వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే కొడాలి నానిపై హాట్‌ కామెంట్లు చేశారు జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌.. కృష్ణా జిల్లా గుడివాడలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన ఆయన.. ఈ సందర్భంగా సభలో మాట్లాడుతూ.. కొడాలి నానిని తిట్టాలని నాకు ఏమీ లేదు అన్నారు.. నాకు వ్యక్తిగతంగా కొడాలి నానితో ఏ శత్రుత్వం లేదన్నారు.. అయితే, వంగవీటి రాధా వివాహంలో కొడాలి నాని కనపడితే కలిశాను అని గుర్తుచేసుకున్నారు.. కానీ, కొడాలి నాని నోరు పారేసుకునే ఎమ్మెల్యే అని విమర్శించారు.. నాని నోరు కట్టడి చేయాలి అంటే రాముని గెలిపించాలని గుడివాడ ప్రజలకు పిలుపునిచ్చారు.

Read Also: Uttarpradesh : రూ.50కోసం కన్న కొడుకుపై దారుణంగా దాడి చేసిన తండ్రి

ఇక, వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వం దాడులు, దోపిడీ ప్రభుత్వం అని విరుచుకుపడ్డారు పవన్‌ కల్యాణ్‌.. ఎన్టీఆర్, ఎంజీఆర్ మాదిరిగా రాజకీయాల్లో అందరికీ అవ్వదంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.. జనసేన పార్టీని కాపాడటానికి కాదు.. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం బాగు కోసం వచ్చాను అన్నారు. రోడ్లు గోతులు.. అడిగితే ఎమ్మెల్యేలు బూతులు అంటూ సెటైర్లు వేశారు.. మరోవైపు.. అది ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ కాదు.. ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ అంటూ ఆరోపణలు గుప్పించారు. ఇక, ఎన్టీఆర్ పేరు జిల్లాకు పెట్టి.. ఎన్టీఆర్ యూనివర్శిటీ పేరును వైయస్సార్ యూనివర్సిటీగా మార్చారు అని విమర్శించారు. ఇది సరైన విధానం కాదని హితవుపలికారు. టీడీపీతో విబేధాలు ఉన్నప్పటికీ.. ఆ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును జైల్లో పెట్టించటం బాధించిందన్నారు జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌.

Show comments