Site icon NTV Telugu

Pawan Kalyan: ముందస్తు ఎన్నికలపై పవన్‌ కల్యాణ్‌ ఆసక్తికర వ్యాఖ్యలు..

Pawan

Pawan

Pawan Kalyan: జనసేన ప్రధాన కార్యాలయంలో జరిగిన సర్వసభ్య సమావేశంలో సంచలన వ్యాఖ్యలు చేశారు జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌.. రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు వచ్చే అవకాశం ఉందన్నారు. పార్టీని పెట్టడం.. నడిపించడం సాధాన విషయం కాదు.. కానీ, జనసైనికుల పోరాటం వల్ల.. జనసేన పదేళ్లు పూర్తి చేసుకుందన్నారు.. రాజకీయం చేయాలంటే దోపీడీ చేయాలనే భావనలోకి తీసుకెళ్లారని ఫైర్‌ అయ్యారు.. వాలంటీర్ల గురించి నాకు రెండున్నరేళ్ల ముందే తెలుసు.. వాలంటీర్లు బెదిరిస్తున్నారు, ఇబ్బంది పెడుతున్నారు అని చెప్పేవారు.. కొందరు వైసీపీ నేతలే నా దృష్టికి తేచ్చిన పరిస్థితి ఉంది.. వైసీపీ వారి నుంచి నిరసన గళం విన్నాను అని తెలిపారు. మాదేం లేదు అన్నీ వాలంటీర్లు చేస్తున్నారు అని వైసీపీ నేతలే చెబుతున్నారన్న ఆయన.. హ్యూమన్ ట్రాఫికింగ్ గురించి కూడా పార్లమెంట్ లో చెప్పారని.. NCRB డేటా గురించి తెలుసుకుని నేను మాట్లాడానను స్పష్టం చేశారు.

Read Also: Top Headlines @ 5 PM: టాప్‌ న్యూస్‌

జగన్ అనే దుష్ట పాలకుడు మీద మనం పోరాటం చేయాలి అని పిలుపునిచ్చారు పవన్‌.. మనవాళ్ళ మీదే పక్కనుండి పొడవటం, సోషల్ మీడియా లో పోస్టుకు పెట్టడం సరి కాదని హితవుపలికారు. ఓటర్ల నమోదు, ఓట్ల తొలగింపుపై నేతలు ఫోకస్ పెట్టండి అని సూచించారు. ఇక, ఏపీ అభివృద్ది తెలంగాణకు కూడా చాలా అవసరం అన్నారు. హైదరబాద్ నుంచి షిఫ్ట్ అయ్యారా? అంటున్నారు.. నేను గతంలోనే విజయవాడ పటమటలో ఉండేవాడిని అని గుర్తుచేసుకున్నారు. హైదరాబాద్‌ ఆంధ్ర వాళ్ల రాజధాని కాదని చెబితే.. ఇక్కడ ఇల్లు, స్థలం ఎక్కడ కొనాలో తెలియలేదన్నారు. ఏపీని రాక్షస పాలన నుంచి విముక్తి చేయాల్సి ఉంది.. రాజకీయాలు అంటే అనేక ప్రలోభాలు ఉంటాయి.. పదేళ్లుగా ప్రతికూల పరిస్థితుల్లో జనసేన నిలబడి ఉంది.. ఈ ఎన్నికల్లో చాలా గొడవలు ఉంటాయని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎందుకంటే వైఎస్‌ జగన్, ఆయన అనుచరులు ఆధిపత్యం వదులు కోవటానికి సిద్దంగా ఉండరు.. అందుకే గొడవలకు అవకాశం ఉందన్నారు. కావున జనసైనికులు అప్రమత్తంగా ఉండాలని.. ఈ ప్రభుత్వాన్ని గద్దె దించడమే లక్ష్యంగా పెట్టుకోవాలని సూచించారు జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌.

Exit mobile version