Pawan Kalyan Fan: పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకల్లో పెను విషాదం.. కరెంట్ షాక్తో అభిమాని మృతి!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pawan Kalyan Birthday Tragedy: అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో విషాద ఘటన చోటుచేసుకుంది. జనసేన అధినేత, ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకల ఏర్పాట్లలో పాల్గొన్న ఓ యువకుడు విద్యుత్ షాక్కు గురై మృతి చెందాడు. అమలాపురంలోని ఓ కళాశాల సమీపంలో ఫ్లెక్సీ ఏర్పాటు చేస్తుండగా ప్రమాదం జరిగింది. మృతుడు బెండమూర్లంక గ్రామానికి చెందిన రోళ్ల ప్రేమ్ కుమార్. ప్రేమ్ మరణంతో పవన్ కళ్యాణ్ పుట్టినరోజున పెను విషాదం నెలకొంది.
ప్రేమ్ కుమార్ హైదరాబాద్లో ఉద్యోగం చేస్తున్నాడు. తన అభిమాన హీరో పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలను స్నేహితులతో కలిసి నిర్వహించాలనే ఉద్దేశంతో స్వగ్రామానికి వచ్చాడు. అమలాపురంలోని ఓ కళాశాల సమీపంలో ఫ్లెక్సీ ఏర్పాటు చేస్తుండగా.. ప్రమాదవశాత్తు విద్యుత్ వైరు తగలడంతో ప్రేమ్ కుమార్ విద్యుత్ షాక్కు గురయ్యాడు. విద్యుత్ షాక్ తీవ్రత ఎక్కువగా ఉండటంతో అతడు అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకుని వివరాలు సేకరించారు. ప్రమాదానికి సంబంధించిన పరిస్థితులను పరిశీలించారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
Also Read
- 350cc ఇంజిన్, 14.5 లీటర్ల ట్యాంక్, TFT డిస్ప్లేతో Triumph Bonneville T40 లాంచ్.. ధర ఎంతంటే?
- Deputy CM Pawan Kalyan: పోలవరం పర్యటనకు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
- Nana Patekar: క్రికెట్ అంటే నానాకు పిచ్చి.. విరాట్ అవుటైతే అన్నం కూడా తినేవారు కాదట..!
- Ravindra Jadeja: బీసీసీఐ చీఫ్ సెలెక్టర్ పోస్టుపై జడేజా కన్ను.. ఆ పదవి కోసం జడ్డూ ఏం చేశాడో చూడండి..!
ప్రేమ్ కుమార్ మృతి విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు, స్నేహితులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకల కోసం ఎంతో ఉత్సాహంగా వచ్చిన యువకుడు ఇలా ప్రాణాలు కోల్పోవడంతో జనసేన కార్యకర్తలు, స్థానికుల్లో కూడా విషాదం నెలకొంది. ఫ్లెక్సీలు, బ్యానర్లు ఏర్పాటు చేసే సమయంలో విద్యుత్ వైర్ల విషయంలో అప్రమత్తంగా ఉండాలని, ఎలాంటి ప్రమాదాలకు తావులేకుండా భద్రతా చర్యలు పాటించాలని అధికారులు సూచిస్తున్నారు.
తాజావార్తలు
-
350cc ఇంజిన్, 14.5 లీటర్ల ట్యాంక్, TFT డిస్ప్లేతో Triumph Bonneville T40 లాంచ్.. ధర ఎంతంటే?
-
Explainer: రణక్షేత్రాన్ని తలపిస్తోన్న ఢిల్లీ..అక్టోబర్ 10న ఏం జరగనుంది?
-
Deputy CM Pawan Kalyan: పోలవరం పర్యటనకు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
-
Nana Patekar: క్రికెట్ అంటే నానాకు పిచ్చి.. విరాట్ అవుటైతే అన్నం కూడా తినేవారు కాదట..!
-
Explainer: చంద్రుడిపై అణు యుద్ధాలు!?
ట్రెండింగ్
-
Royal Enfield Classic 350 ధర పెంపు.. కొత్త ధరలు ఇవే!
-
Free International Roaming: బంపర్ ఆఫర్.. 5GB డేటా, 60 నిమిషాల కాల్స్తో పాటు ఉచిత అంతర్జాతీయ రోమింగ్..!
-
IP68+IP69 రేటింగ్స్, 5-స్టార్ డ్రాప్ రెసిస్టెన్స్, 8,000mAh బ్యాటరీతో Vivo Y32 లాంచ్.. ధర, స్పెసిఫికేషన్లు ఇవే!
-
Indian Air Force Day : ఒక్క విమానం వెనుక ఇంత కథ ఉందా?
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!