NTV Telugu Site icon

Pawan Kalyan Birthday: పవన్‌ కల్యాణ్‌ ఫాన్స్‌కు నిరాశ.. అప్‌డేట్స్‌ అన్నీ క్యాన్సిల్!

Pawan Kalyan Birthday

Pawan Kalyan Birthday

Pawan Kalyan Fans are Disappointed after No Updatefrom OG: నేడు ‘పవర్ స్టార్’ పవన్‌ కల్యాణ్‌ పుట్టినరోజు. బర్త్‌డే సందర్భంగా ఆయనకు సోషల్ మీడియాలో శుభాకాంక్షలు వెల్లువెత్తున్నాయి. మరోవైపు ‘గబ్బర్ సింగ్’ రీ-రిలీజ్ నేపథ్యంలో పవన్‌ ఫాన్స్ థియేటర్ల వద్ద సందడి చేస్తున్నారు. అయితే పవర్ స్టార్ పుట్టినరోజు సందర్భంగా ఆయన అప్‌కమింగ్‌ సినిమాలకు సంబంధించిన అప్‌డేట్స్‌ ప్రకటిస్తామని చెప్పిన నిర్మాణ సంస్థలు అభిమానులను నిరాశకు గురిచేశాయి. తెలుగు రాష్ట్రాల్లో వరదల కారణంగా నేడు విడుదల కావాల్సిన అప్‌డేట్స్‌ను క్యాన్సిల్‌ చేస్తున్నట్లు వెల్లడించాయి.

సుజిత్‌ దర్శకత్వంలో పవన్‌ కల్యాణ్‌ హీరోగా తెరకెక్కుతోన్న సినిమా ‘ఓజీ’. పవన్‌ పుట్టినరోజు నాడు ఓజీ అప్‌డేట్స్‌ ఇస్తామని ఇటీవల నిర్మాణ సంస్థ ప్రకటించింది. అప్‌డేట్ వాయిదా వేస్తున్నట్లు తెలిపింది. అంతేకాదు పోస్టర్‌ కూడా రిలీజ్‌ చేయడం లేదని పేర్కొంది. ‘ఏపీ, తెలంగాణలో కురుస్తున్న భారీ వర్షాలకు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వరదల కారణంగా బర్త్‌డే కంటెంట్‌ రిలీజ్‌ను క్యాన్సిల్ చేస్తున్నాం. ఓజీ కొన్నేళ్ల పాటు సెలబ్రేట్‌ చేసుకునేలా ఉంటుంది. త్వరలోనే భారీ సెలబ్రేషన్స్‌ చేసుకుందాం’ అని పేర్కొంది.

Also Read: Bigg Boss Telugu 8: కోట్లు ఇచ్చినా బిగ్‌బాస్‌ చేయనంది.. హుషారెత్తించే స్టెప్పులేస్తూ హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చింది!

పవన్‌ కల్యాణ్‌ పుట్టినరోజు సందర్భంగా ‘హరిహర వీరమల్లు’ నుంచి కొత్త పోస్టర్‌ విడుదల చేయాలని మేకర్స్‌ భావించారు. ఇది కూడా క్యాన్సిల్ అయింది. ‘పవన్‌ ఫ్యాన్స్‌ కోసం ఓ ఆసక్తికరమైన పోస్టర్‌ను ఈరోజు రిలీజ్‌ చేద్దామనుకున్నాం. వరదల కారణంగా తెలుగు రాష్ట్రాల్లో ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి. ఈ సమయంలో పోస్టర్‌ రిలీజ్‌ చేయడం సరికాదు. ఫాన్స్ అర్థం చేసుకొని మాకు సహకరిస్తారని ఆశిస్తున్నాం’ అని చిత్ర నిర్మాణ సంస్థ ప్రకటించింది. రెండు అప్‌డేట్స్‌ క్యాన్సిల్ అవ్వడంతో పవర్ స్టార్ ఫాన్స్ కాస్త నిరాశకు గురయ్యారు.

Show comments