Site icon NTV Telugu

Pawan Kalyan: నన్ను అందరూ ఆడుకుంటున్నారు.. కానీలే అని వదిలేసాను..

Pavan

Pavan

Pawan Kalyan: నేను హైదరాబాదులో జరిగిన ఓజి (OG) సినిమా సక్సెస్ మీట్ ఈవెంట్ లో భాగంగా ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, సినిమా హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హాజరు అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. OG సినిమాకు దర్శకుడు సుజిత్, సంగీత దర్శకుడు తమన్ నన్ను ఎలా తయారు చేశారంటే.. ఏదో తెల్ల చొక్కా.. జుబ్బా వేసుకొని వచ్చేద్దామంటే లేదండి, బ్లాక్ డ్రెస్ లో రావాలని, కళ్ళజోడు పెట్టుకొని రావాలని అన్నారు.

Sujeeth: ఆ సినిమాతోనే నా ప్రయాణం మొదలు.. ‘జానీ’ లేకపోతే నేను లేను

ఇదివరకు సినిమా రిలీజ్ ముందు జరిగిన కార్యక్రమంలో కటానా పట్టుకుని వచ్చానని అలా నా జీవితంలో ఎప్పుడు చేయలేదని ఆయన అన్నారు. స్టేజి మీదకు వచ్చేందుకు అప్పుడు స్టేజి వద్ద తను వంగి, దాని దగ్గర దాక్కుంటే.. అది పైకి వస్తూ ఉంటుందని అన్నారు. పైగా వర్షం పడుతుందని.. అక్కడ హడావిడి మాములుగా లేదని అన్నారు. మొత్తంగా తనని అందరూ ఆడుకుంటున్నారని, కానీ అని చెప్పి వదిలేసానని అన్నారు.

CM Chandrababu: ఆ తల్లి చల్లని చూపు రాష్ట్రంపై ఇదే విధంగా కొనసాగాలి..

కానీ ఈరోజు మళ్లీ.. నల్ల కళ్ళద్దాలు పెట్టుకొని గన్నుతో రావాలని అని అన్నారని.. దానికి నేను చంపేస్తానని చెప్పినట్టు తెలిపారు. తుపాకులు, కత్తులు అనే వీక్నెస్ తో తనని ఆడుకుంటున్నారని పవన్ కళ్యాణ్ వాపోయాడు. అయితే ఇందుకోసం ప్రొడక్షన్ డిజైనర్ ప్రత్యేకంగా తయారు చేసిన గన్నుని తీసుకోవచ్చారని తెలిపారు. అయితే, ఆ గన్ రష్యన్ తయారుచేసిన మోడల్ గన్ అని తెలిపారు. ఇక తాను సినిమా రంగానికి వచ్చి దాదాపు 30 సంవత్సరాల నుండి నన్ను ఆదరిస్తున్న అభిమానుల కోసం ప్రత్యేకంగా థమన్, సుజిత్ ల కోసం గన్ ను పట్టుకొని ఫోటోకు ఫోజు ఇస్తున్నానని తెలిపారు.

Exit mobile version