NTV Telugu Site icon

Pawan Kalyan: హలో ఏపీ.. బై బై వైసీపీ.. ఇదే మన నినాదం..

Pk

Pk

Pawan Kalyan: హలో ఏపీ.. బై బై వైసీపీ.. ఇదే మన నినాదం అంటూ పిలుపునిచ్చారు జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌.. అమలాపురంలో వారాహి విజయ యాత్ర భారీ బహిరంగ సభలో మాట్లాడిన పవన్‌ కల్యాణ్‌.. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు.. జనం బాగుండాలంటే జగన్ పోవాలి.. అరాచకం ఆగాలంటే ఈ ప్రభుత్వం పోవాలి.. అభివృద్ధి జరగాలంటే ఈ ప్రభుత్వం పోవాలి అంటూ నినాదాలు చేశారు జనసేనాని.. గత ఎన్నికల్లో ఓటు వేసేటప్పుడు యువత ఒక్కసారి ఆలోచించి ఉంటే బాగుండేదని అన్నారు. ఓట్లు వేసి వైసీపీని గెలిపించారని, కానీ, ఉద్యోగాలు మాత్రం రాలేదన్నారు. తనను గెలిపించి అసెంబ్లీకి పంపించి ఉంటే కనీసం లక్ష ఉద్యోగాలు పడేవని వ్యాఖ్యానించారు పవన్‌. ఇంకోసారి వారి నాయకుడు నవ్వుకుంటూ, ముద్దులు పెట్టుకుంటూ వస్తే రోడ్డుపైనే నిలదీయండి.. 2.3 లక్షల ఉద్యోగాలు ఏవని ప్రశ్నించండి అంటూ పిలుపునిచ్చారు.

కోనసీమ వాడి వేడి తట్టుకోలేక పోతున్నా.. కోనసీమ ప్రజలకు హృదయపూర్వక నమస్కారం అంటూ ఉపన్యాసం ప్రారంభించిన పవన్‌.. మీరు చూపుతున్న అభిమానాన్ని తట్టుకోలేక పోతున్నా.. పది సంవత్సరాల పూర్తి పార్టీ పెట్టి.. పార్టీ నిర్మాణం కష్టం. మీ ఆధరణతోనే నడుపుతున్నా అన్నారు.. ఇక, అమలాపురం అల్లర్లకు వైసీపీ ప్రభుత్వమే కారణం అని ఆరోపించారు పవన్‌.. ఈ అల్లర్లలో 251 మంది అమాయక యువకులపై పెట్టిన కేసులు ఎత్తివేయాలని చేతులు ఎత్తి నమస్కారించి డీజీపీని కోరారు జనసేనాని.. ఒక్కసారి అవకాశమిస్తే ప్రజలను నట్టేట ముంచారు.. వైసీపీ ప్రభుత్వం అవసరమా లేదో ప్రజలు ఆలోచించి వచ్చే ఎన్నికలలో ఓటు వేయాలని సూచించారు..

గోడవలు సృష్టించే వాడు కాదు.. నివారించే శక్తి ఉన్న వాడే నాయకుడు అన్నారు పవన్‌.. చిన్న వారాహి వాహనంపై తిరుగుతున్న జనసేన అంటే వైసీపీ నేతలకు ఎందుకు భయం? అని ప్రశ్నించారు.. ఇక, ఉభయగోదావరి జిల్లాలంటే ఇతర ప్రాంతాలకు ఈర్య తాను భీమవరంలో, కోనసీమలో పార్టీ ఆఫీసు పెడతా.. ప్రజా సమస్యలు పరిష్కారానికి అందుబాటులో ఉంటానని వెల్లడించారు.. కొబ్బరి రైతులకు అండగా ఉంటా.. ధాన్యం రైతులను దగా చేస్తున్నారు. కాకినాడకు చెందిన దళారులు బస్తాకు 40 రూపాయలు దోచుకుంటున్నారు అని మండిపడ్డారు.. కోనసీమ రైతులకు గిట్టుబాటు ధర లభించడం లేదు.. ఒక్క ఛాన్స్ ఇచ్చినందుకు రైతులకు ఈ కష్టాలు వచ్చాయి.. జనసేన ప్రభుత్వం వచ్చిన తరువాత కొబ్బరి రైతుకు గిట్టుబాటు ధర కల్పించేందుకు కృషి చేస్తానని ప్రకటించారు.. 20 రూపాయలు రావాల్సిన కొబ్బరికాయ కు ప్రస్తుతం ఏడు రూపాయలు వస్తోంది.. కొబ్బరి అనుబంధ పరిశ్రమలు రావాలన్న పవన్‌.. కొబ్బరి అభివృద్ధి బోర్డ్ రీజనల్ కార్యాలయం విజయవాడలో ఉంది. అది కోనసీమకు రావాలన్నారు..

175 సీట్లు, అన్ని ఎంపీ స్థానాలు తమవేనని వైసీపీ నేతలు చెబుతున్నారు.. మరి మాపై ప్రతి రోజూ ఎందుకు విమర్శలు చేస్తారు? వారాహి వాహనంపై వెళుతుంటే ఎందుకు భయపడుతున్నారు? అని ఎద్దేవా చేశారు పవన్‌.. జనసేన బలం ఏంటన్నది ఇప్పుడు వైసీపీ వాళ్లకు అర్థమైందన్న ఆయన.. రాష్ట్రానికి పట్టిన వైసీపీ తెగులును తీసేస్తా.. వచ్చే ఎన్నికల్లో నాకు అండగా నిలబడండి. నేనేమీ హైదరాబాద్ నుంచి మాట్లాడడంలేదు.. రాజమండ్రిలో పార్టీ ఆఫీసు పెట్టాను. కాకినాడ, పిఠాపురం, అమలాపురంలోనూ కార్యాలయాలు తెరుస్తాం. నేను కూడా ఇక్కడే ఉంటానని భరోసా ఇచ్చారు జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌.