Site icon NTV Telugu

Pawan Kalyan: సీఎంకు పవన్‌ 12 ప్రశ్నలు..

Pawan Kalyan

Pawan Kalyan

Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డికి 12 ప్రశ్నలు సంధించారు జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌.. ఏపీలో చేపట్టిన కులగణనపై సోషల్‌ మీడియా వేదికగా 12 ప్రశ్నలు వేశారు పవన్.. అసలు, ఈ కులగణన ఉద్దేశం మీకు ఎన్నికల ముందే ఎందుకు వచ్చింది? కులగణనపై గెజిట్ నోటిఫికేషన్ ఎందుకివ్వలేదు..? ఇది రాజ్యాంగం ఆర్టికల్ 21 ప్రకారం వ్యక్తిగత గోప్యత, భద్రతా, స్వేచ్ఛ హరించడం కాదా..? కులగణనే ఉద్దేశమైతే, ఉపకులం, ఆదాయం, భూమి యాజమాన్యం, కోళ్లు, మేకలు, ఆవులు, గేదలు ఈ వివరీలన్నీ ఎందుకు? బీహార్ ప్రభుత్వం చేసిన కులగణనపై సుప్రీంకోర్టులో తీర్పు పెండింగులో ఉంది. స్వీయ ప్రయోజనాలకు ఎందుకు ప్రజా ధనాన్ని వృథా చేస్తున్నారు? ఇది ఎంతో మంది నిపుణలతో చేయాల్సిన కులగణన ప్రక్రియ వలంటీర్లతోనా..? ఇటువంటి డేటా సేకరణ ప్రక్రియ గతంలో కేంబ్రిడ్జ్ అనలిటిక చేసినప్పుడు సమాజంలో అశాంతిని, అల్లర్లకు ప్రేరేపించాయనే విషయం తెలియదా? అని ప్రశ్నించారు.

Read Also: Minister RK Roja: 2024 ఎన్నికల్లో జగన్ గెలుపు ఎవరూ ఆపలేరు.. నాన్‌లోకల్‌ పొలిటిషన్స్‌ను ఎవరూ పట్టించుకోరు

ఇక, ఎన్నికల కోసం స్వీయ ప్రయోజనాలకు మీరు ఎలా వాడుకున్నారో మాకు తెలియదని అనుకుంటున్నారా? ఇవన్నీ మీ అధికార దాహానికి ప్రతీక కాదా? అని ప్రశ్నించారు పవన్‌.. ఇలా సేకరించిన డేటా ఏ విధమైన దుర్వినియోగం జరగకుండా మీరు తీసుకున్న నిర్ణయాలు ఏమిటి? ప్రజల నుంచి డేటా సమ్మతి అనేది మీరు ఎలా తీసుకుంటున్నారు..? వాలంటీర్ల ద్వారా వైసీపీ ప్రభుత్వం సేకరిస్తున్న కుల గణన, ఇతర వివరాలను ఏ కంపెనీ భద్రపరుస్తారనే అంశంపై శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. ఇక, కులగణమనపై న్యాయపరమైన ఆలోచనలు చేస్తామని తన ట్వీట్‌లో పేర్కొన్నారు జనసేన అధినేత పవన్‌ కల్యాణ్.

Exit mobile version