NTV Telugu Site icon

Pawan Kalyan Kakinada Tour: కాకినాడలో మకాం వేసిన జనసేనాని.. 3 రోజులు అక్కడే

Pawan Kalyan

Pawan Kalyan

Pawan Kalyan Kakinada Tour: జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ మరోసారి క్షేత్రస్థాయి పర్యటనకు వెళ్లారు. మూడు రోజుల పాటు కాకినాడలో మకాం వేయనున్నారు.. దీనికోసం బుధవారం రోజు కాకినాడ చేరుకున్నారు జనసేనాని.. ఇక, మూడు రోజుల పాటు అంటే.. ఈ నెల 28, 29, 30 తేదీల్లో అక్కడే మకాం వేయనున్నారు. కాకినాడ పార్లమెంట్ నియోజకవర్గంలో పార్టీ పరిస్థితిపై సమీక్ష చేపట్టనున్నారు.. ఈ పర్యటనలో జనసేన పార్టీ స్థానిక నేతలతో పాటు, కార్యకర్తలతోనూ సమావేశాలు నిర్వహించే అవకాశాలు ఉన్నాయిని చెబుతున్నారు.. కానీ, పవన్‌ కల్యాణ్‌ పర్యటనకు సంబంధించిన పూర్తి వివరాలను జనసేనా ఇంకా అధికారికంగా ప్రకటించలేదు..

Read Also: Smartphones: ఫోన్ లోని ఫ్లైట్ మోడ్ వల్ల కలిగే లాభలేంటో తెలుసా?

ఇక, బుధవారం రాత్రి కాకినాడ చేరుకున్న జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు ఘన స్వాగతం పలికాయి పార్టీ శ్రేణులు.. ఈ నెల 30వ తేదీ వరకు మూడు రోజులు పాటు కాకినాడలోనే ఉండబోతున్నారు పవన్‌.. ఉమ్మడి జిల్లా పార్టీ నేతలతో సమావేశాలు నిర్వహించనున్నారని తెలుస్తోంది.. ఈ పర్యటనలో కాకినాడ పార్లమెంట్ పరిధిలోని అసెంబ్లీ నియోజక వర్గాలలో జనసేన ఎక్కడి నుంచి పోటీ చేయనుంది.. ఎవరిని బరిలోకి దించుతారు అనేదానిపై క్లారిటీ రాబోతుంది అంటున్నారు నేతలు.. అయితే, పవన్‌ పర్యటనతో జనసేన వర్గాలతో పాటు ఆశావహులు, మిగతా పార్టీ నేతల్లోనూ ఆసక్తి నెలకొంది. ఇప్పటికే అధికార వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ సహా పలు పార్టీల నేతలు జనసేన వైపు చూస్తున్నారు.. ఇప్పటికే పలువురు నేతలు జనసేన కండువా కప్పుకున్నారు. జనసేనాని పర్యటనలో ఇంకా ఎవరైనా ఆయనతో టచ్‌లోకి వస్తారా? పార్టీలో చేరతారా? అనే చర్చ కూడా జోరుగా సాగుతోంది.

Show comments