Site icon NTV Telugu

Patnam Sunitha Mahender Reddy: తల్లి కోసం కూతురు ఇంటింటి ప్రచారం

Patnam Manisha Reddy

Patnam Manisha Reddy

Patnam Sunitha Mahender Reddy: ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో మల్కాజిగిరి పార్లమెంట్‌ కాంగ్రెస్ అభ్యర్థి పట్నం సునీత మహేందర్‌ రెడ్డి ప్రచారంలో వేగాన్ని పెంచారు. మరో వైపు తల్లి గెలుపును కాంక్షిస్తూ ఆమె కూతురు మనీషా రెడ్డి జోరుగా ప్రచారం చేస్తున్నారు. శనివారం కేపీహెచ్‌బీలో మనీషా రెడ్డి గడప గడపకు తిరుగుతూ ఇంటింటి ప్రచారం నిర్వహించారు. అలాగే రోడ్‌ షో కార్యక్రమంలో కూడా ఆమె పాల్గొన్నారు.

కేపీహెచ్‌బీ 114వ డివిజన్ అధ్యక్షుడు తమ్మినేని ప్రవీణ్ కుమార్,వర్కింగ్ ప్రెసిడెంట్ దేంది అరవింద్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మనీషా రెడ్డి ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నారు. అభివృద్ధి కోసం సునీత మహేందర్‌రెడ్డికి ఓటేసి గెలిపించాలని ప్రజలను అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో టీపీపీసీ సెక్రటరీ 114వ డివిజన్ కోఆర్డినేటర్ గాలి బాలాజీ, సంధ్య, మహిళా అధ్యక్షురాలు రజిత, అప్పరావ్, ఫణీంద్ర, రాజేష్ గౌడ్, నితీష్ గౌడ్, రంగస్వామి, గంధం రాజు, వనజ,కిరణ్,రాజేష్, లక్ష్మి అరవింద, పీఆర్ నాయుడు, రామారావు, తదితరులు పాల్గొన్నారు.

 

Exit mobile version