NTV Telugu Site icon

Patnam Mahender Reddy : రంగారెడ్డి జిల్లాలో గోదాంల నిర్మాణానికి 38 కోట్లు అందించాం

Patnam

Patnam

వికారాబాద్ జిల్లా కోటపల్లి మార్కెట్ కమిటీ నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకారోత్సవంలో మంత్రి డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మహేందర్ రెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ హైదరాబాద్ లో ఇచ్చిన 6 గ్యారంటీ డిక్లరేషన్ లను కర్ణాటకలో ముందు అమలు చేయాలన్నారు. కర్ణాటకలో రైతు బీమా లేదు, రైతు బంధు లేదు, రైతులకు కరెంటు లేదని, తెలంగాణలో ప్రజలను, రైతులను మభ్య పెట్టేందుకు కాంగ్రెస్ కుట్రలు చేస్తుందని మహేందర్ రెడ్డి మండిపడ్డారు.

Also Read : Vijay Varma: ఆమెతో శృంగారం.. వెన్నులో వణుకు పుట్టింది.. తమన్నా బాయ్ ఫ్రెండ్ సంచలన వ్యాఖ్యలు

సీఎం కేసీఆర్ చేస్తున్న పథకాలను నేరుగాంచేందుకు చూసి ఓర్వలేక ఆరోపణ చేస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు. జిల్లాలో 65 వేల మంది రైతులకు 353 కోట్ల రుణమాఫీ జరిగిందని, కొత్త జిల్లాలు, కొత్త మండలాలు, కొత్త మార్కెట్లు, కొత్త కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసిన ఘనత సీఎం కేసీఆర్ కే దక్కిందన్నారు మంత్రి మహేందర్‌ రెడ్డి. రంగారెడ్డి జిల్లాలో గోదాంల నిర్మాణానికి 38 కోట్లు అందించామని ఆయన తెలిపారు. వికారాబాద్ జిల్లాలో సుమారు 3000 కోట్ల రైతుబంధు రైతులకు అందించామని, జిల్లాలో 236 కోట్ల రైతు బీమాను ప్రమాదవశత్తు మృతి చెందిన రైతులకు అందించామన్నారు. ఈ పథకాలు కర్ణాటకలో ఉన్నాయా అంటూ మహేందర్ రెడ్డి ప్రశ్నించారు.

Also Read : Leo: డెవిల్ తో లియో పోరాటం.. విజయ్ నట విశ్వరూపం