ఐపీఎల్ 2024 ఎండ్కార్డ్ పడే సమయం దగ్గర పడింది. ఆదివారం నాడు (మే 26 ) కోల్‌కతా-హైదరాబాద్ మధ్య ఫైనల్ సమరం జరగనుంది. ఈ మ్యాచ్ సందర్భంగా ప్యాట్ కమిన్స్ విలేకరుల సమావేశంలో పాల్గొన్నాడు. అయితే టీవీలో ధోనీ కొట్టిన సిక్స్.. కమిన్స్ దృష్టిని టీవీ వైపు మళ్లించింది. ఫైనల్ మ్యాచ్ కు ముందు ఈరోజు నిర్వహించిన విలేకర్ల సమావేశంలో పాల్గొన్నారు. ప్రెస్ కాన్ఫరెన్స్ ప్రారంభానికి ముందు వేచి చూస్తుండగా.. అతనికి ఎడమవైపులో ఉన్న టీవీలో ధోనీ సిక్స్ కొట్టిన వీడియో ప్లే అవుతుంది. అయితే కమిన్స్.. ఆ వీడియోను అలానే చూస్తూ ఉండిపోయాడు. ధోనీ కొట్టిన సిక్స్ ను ఆస్వాదించాడు. అనంతరం ప్రెస్ కాన్ఫరెన్స్‌లో ధోనీపై ప్రశంసల జల్లు కురిపించాడు. ఐపీఎల్ లో ధోనీ ఆడిన తీరు గురించి కొనియాడారు. అంతేకాకుండా.. ధోనీ సాధించిన విజయాల గురించి మాట్లాడాడు. అయితే.. కమిన్స్ టీవీ చూస్తున్న వీడియో మాత్రం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
Read Also: Palnadu SP: పల్నాడులో 666 మంది నేర చరిత్ర కలిగిన వ్యక్తుల గుర్తింపు
ఇదిలా ఉంటే.. ఐపీఎల్ 2024 టైటిల్ సాధించేందుకు.. సన్‌రైజర్స్ హైదరాబాద్-కోల్‌కతా నైట్ రైడర్స్ మధ్య కీలక పోరు జరగనుంది. అయితే.. ఐదు రోజుల క్రితం కోల్‌కతా నైట్ రైడర్స్ చేతిలో హైదరాబాద్ 8 వికెట్ల తేడాతో ఘోర పరాజయాన్ని ఎదుర్కొంది. కాగా.. అదే జట్టుతో నిర్ణయాత్మక మ్యాచ్‌లో తలపడనుంది. కేకేఆర్ తో ఓడిపోయినప్పటికీ శుక్రవారం చెన్నైలో జరిగిన చివరి క్వాలిఫయర్‌లో రాజస్థాన్ రాయల్స్‌ను 36 పరుగుల తేడాతో ఓడించి హైదరాబాద్ ఫైనల్‌కు చేరుకుంది. చూడాలి మరి చెన్నై స్టేడియంలో ఎస్ఆర్హెచ్ చెలరేగుతుందా లేదా అనేది.
Video of Pat Cummins Watching MS Dhoni in Captain’s Press Conference 💛🦁 pic.twitter.com/GBVNDyFkb0
— Prakash (@definitelynot05) May 25, 2024
Read Also: IPL 2024 Final: ట్రోఫీతో కమిన్స్, శ్రేయాస్ ఫొటో షూట్.. పడవ, ఆటోలో మాములుగా లేదుగా
