Pat Cummins Injury Update: SRH అభిమానులకు గుడ్ న్యూస్.. కెప్టెన్ ‘కమిన్స్’ రీ-ఎంట్రీపై బిగ్ అప్డేట్..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pat Cummins Injury Update: ఐపీఎల్ 2026 ప్రారంభానికి ముందే సన్ రైజర్స్ హైదరాబాద్ (SRH) జట్టుకు పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. జట్టు కెప్టెన్ పాట్ కమిన్స్ గాయం కారణంగా సీజన్ మొదట్లో కొన్ని మ్యాచ్ లకు దూరం కానున్నాడు. దీంతో తాత్కాలికంగా జట్టు నాయకత్వ బాధ్యతలను ఇషాన్ కిషన్ కు అప్పగించినట్లు ఫ్రాంచైజీ తెలిపిన సంగతి విదితమే. నిజానికి మొదట కమిన్స్ సీజన్ మొదటి భాగం పూర్తిగా దూరమవుతాడని భావించినప్పటికీ, హెడ్ కోచ్ డేనియల్ వెటోరి తాజా సమాచారం ఇచ్చాడు. కమిన్స్ ఫిట్ గా ఉన్నాడని మరో 10 రోజుల్లో మైదానంలోకి తిరిగి వచ్చే అవకాశాలు ఉన్నాయని తెలిపారు.
Also Read
హెడ్ కోచ్ డేనియల్ వెటోరి ప్రకారం కమిన్స్ ఫిట్నెస్ విషయంలో ఎలాంటి సమస్య లేదు. అయితే దీర్ఘకాలంగా మ్యాచ్ లకు దూరంగా ఉండటం వల్ల బౌలింగ్ లోడ్ ను మళ్లీ పెంచుకోవడం ప్రధాన సమస్యగా మారిందని అన్నారు. మరోవైపు క్రికెట్ ఆస్ట్రేలియా కూడా అతని ఫిట్నెస్ పై కన్నేసిందని ఆయన అన్నారు. గతంలో గాయాల కారణంగా యాషెస్ సిరీస్, టీ20 వరల్డ్ కప్ 2026కు దూరమైన కమిన్స్‌ను త్వరగా రిస్క్ తీసుకుని ఆడించబోమని ఆస్ట్రేలియా బోర్డు స్పష్టం చేసింది.
ఇదిలా ఉంటే, సన్ రైజర్స్ హైదరాబాద్ (SRH) జట్టు కాంబినేషన్‌పై ఇంకా చర్చలు కొనసాగుతున్నాయని కోచ్ అన్నారు. ముఖ్యంగా బ్యాటింగ్ విభాగంలో స్థానిక ఆటగాళ్లు గట్టి పోటీ ఇస్తున్నారని.. ప్రస్తుతం మంచి ఫామ్‌లో ఉన్న ఆటగాళ్లలో స్మరణ్, సలీల్ లు అద్భుతంగా ఆడుతున్నారని పేర్కొన్నారు. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీతో పాటు ప్రాక్టీస్ మ్యాచ్ లలో వీరి ప్రదర్శన బాగుండటంతో జట్టులో చోటు కోసం పోటీ పెరిగిందని అన్నారు.
కొత్త ఫీచర్లు, మెరుగైన 25కి పైగా అప్డేట్స్తో Hyundai Exter Facelift లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే..!
ఐపీఎల్ 2026 ప్రారంభ మ్యాచ్‌లో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు రాయల్ చాలెంజర్స్ బెంగళూరును ఎదుర్కొననుంది. బలమైన బ్యాటింగ్ లైనప్ ఉన్న ఆర్సీబీకి ఎదురు నిలవాలంటే బౌలింగ్ కాంబినేషన్ కూడా సరిగా ఉండాలని వెటోరి అన్నారు. మొత్తంగా చూస్తే కమిన్స్ గైర్హాజరు ఎస్ఆర్హెచ్కు తాత్కాలిక ఇబ్బందిగా మారినా, అతను త్వరలోనే జట్టులో చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి.
తాజావార్తలు
-
OTR : హిందూపురం గడ్డ మా అడ్డా! బాలయ్య ఇలాకాలో లోకల్ వార్ మొదలైందా?
-
Story Board : BRICS సదస్సు ప్రధాన ఉద్దేశమేంటి..? భారత్ ఎలాంటి సందేశం ఇస్తుంది..?
-
Telangana Assembly : తెలంగాణ అసెంబ్లీకి ఒకరోజు పొడిగింపు.. బుధవారానికి వాయిదా
-
Greenfield Highway : గ్రీన్‌ఫీల్డ్ హైవేపై మృత్యుఘోష.. ఒకే రోజు మూడు ప్రమాదాలు
-
Happy Journey : వందల ఫోన్ నెంబర్లున్నా మాట్లాడుకోలేని ఒంటరితనం.. మనందరి కథే ‘హ్యాపీ జర్నీ’..
ట్రెండింగ్
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్‌తో భారత్ దౌత్యం.. చాబహార్‌తో కొత్త ట్రేడ్ రూట్.!