NTV Telugu Site icon

RGI Airport: శంషాబాద్ ఎయిర్ పోర్టులో ప్రయాణికుల ఆందోళన

Shamshabad

Shamshabad

RGI Airport: శంషాబాద్ ఎయిర్ పోర్టులో ప్రయాణికులు ఆందోళనకు దిగారు. హైదరాబాద్ నుంచి గోరఖ్‌పూర్‌ వెళ్లాల్సిన ఇండిగో విమానంలో సాంకేతిక లోపంతో ఆలస్యం కావడంతో అధికారుల నిర్లక్ష్యానికి ఆందోళన చేశారు. ఉదయం నుండి పడిగాపులు కాస్తున్న ప్రయాణికులను ఎయిర్‌లైన్స్ అధికారులు పట్టించుకోకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారుల తీరుపై అసహనం ప్రయాణికులు వ్యక్తం చేస్తున్నారు.

Read Also: Water Crisis: అడుగంటుతున్న జలాశయాలు.. ముంచుకొస్తున్న తాగునీటి గండం!

విమాన ఆలస్యానికి కారణం చెప్పటం లేదని ప్రయాణికులు అసహనం వ్యక్తం చేశారు. అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉదయం నుండి వచ్చి మంచినీళ్లు కూడా ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. విమానం ఎప్పుడు వెళుతుందో అధికారులు క్లారిటీ ఇవ్వకపోవడంతో ఆందోళనకు దిగారు.