న్యూఢిల్లీ అసెంబ్లీ స్థానంలో మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ను ఓడించి బీజేపీ అభ్యర్థి పర్వేశ్ సాహిబ్ సింగ్ వర్మ సృష్టించారు. న్యూఢిల్లీ అసెంబ్లీ స్థానంలో పర్వేశ్ వర్మ 3181 ఓట్ల భారీ ఆధిక్యంతో అరవింద్ కేజ్రీవాల్‌ను ఓడించారు. కాగా.. గెలుపు అనంతరం ఆయన ఓ ట్వీట్ చేశారు. హిందీలో “జైశ్రీరామ్” అని రాసుకొచ్చారు. ప్రస్తుతంపర్వేశ్ సాహిబ్ సింగ్ వర్మ పేరు దేశ వ్యాప్తంగా సంచలనం కావడంతో ఆయన ట్వీట్ కూడా వైరల్ అవుతోంది.
READ MORE: CM Chandrababu: ఈ నెల 10 తేదీన సీఎం చంద్రబాబు అధ్యక్షతన రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమావేశం..
ఇదిలా ఉండగా.. పర్వేశ్ సాహిబ్ సింగ్ వర్మను ఢిల్లీ కొత్త ముఖ్యమంత్రి పోటీదారుగా చెబుతున్నారు. ప్రవేశ్ వర్మ 1977 నవంబర్ 7న ఢిల్లీలో జన్మించారు. ఆయన భారతీయ జనతా పార్టీ (బిజెపి) సీనియర్ నాయకుడు, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి దివంగత సాహిబ్ సింగ్ వర్మ కుమారుడు. అతని తల్లి పేరు రాంప్యారి వర్మ. ప్రవేశ్ వర్మ స్వాతి సింగ్‌ను వివాహం చేసుకున్నారు. ప్రవేశ్ వర్మ తన ప్రాథమిక విద్యను R.K. లోని ఢిల్లీ పబ్లిక్ స్కూలలో పూర్తి చేశారు. దీని తరువాత అతను కిరోరి మాల్ కళాశాల నుంచి గ్రాడ్యుయేషన్ డిగ్రీని పొందారు. అంతర్జాతీయ వ్యాపారంలో ఎంబీఏ పూర్తి చేశారు.