Paruchuri Gopala Krishna : నేటి తెలుగు చిత్రాల గురించి స్టార్ రైటర్ పరుచూరి గోపాలకృష్ణ కీలక వ్యాఖ్యలు చేసారు.తెలుగు సినిమా స్థాయి పెరిగింది భారీ బడ్జెట్ తో సినిమాలు తెరకెక్కుతున్నాయి.భారీగా కలెక్షన్స్ కూడా సాధిస్తున్నాయి.గతంలో హీరోలు సంవత్సరంలో ఎన్నో సినిమాలు చేసేవారు.సూపర్ స్టార్ కృష్ణ గారు సంవత్సరంలో ఏకంగా 12 సినిమాలు చేసి రికార్డు సృష్టించారు.కానీ కాలం మారింది ఎక్కువ చిత్రాల చేసే స్థాయి నుండిఎక్కువ బడ్జెట్ తో సినిమాలు చేసే స్థాయికి తెలుగు సినిమా ఎదిగింది.దర్శకులు భారీ బడ్జెట్ సినిమాను మొదలు పెట్టి రెండు నుండి మూడు సంవత్సరాలు ఎలాంటి పొరపాటు జరగకుండా ఎంతో జాగ్రత్తగా తెరకెక్కిస్తున్నారు.ప్రస్తుతం తెరకెక్కుతున్న సినిమాలు అన్ని కూడా ఇలానే తెరకెక్కిస్తున్నారు.స్టార్ హీరో ప్రభాస్ నటిస్తున్న “కల్కి 2898 AD “సినిమాను నాగ్ అశ్విన్ పాన్ వరల్డ్ మూవీగా తెరకెక్కిస్తున్నారు.
Read Also :Haromhara Contest : మిస్డ్ కాల్ ఇవ్వండి..బిగ్ గిఫ్ట్ గెలుచుకోండి..
ఈ సినిమాలో అమితాబ్ ,కమల్ వంటి దిగ్గజ నటులు నటిస్తున్నారు.ప్రభాస్ తో పాటు ఆ ఇద్దరు కూడా స్క్రీన్ పై కనిపిస్తే ప్రేక్షకుడి సీటులో కూర్చోగలడా అని అనిపిస్తుంది.విజిల్స్ ,చప్పట్లతో ఫ్యాన్స్ ఎగిరిగంతేస్తారు.ఈ సినిమా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను.ఇలాంటి భారీ సినిమా విజయం సాధిస్తే ఇండస్ట్రీ లో చాలా మందికి మంచి జరుగుతుంది.హీరోప్రభాస్ ను వర్షం సినిమా నుంచి గమనిస్తున్నాను.అతడిది చిన్న పిల్లాడి మనస్తత్వం .తాను ఇప్పటివరకు పరుషంగా మాట్లాడినట్లు నేనెప్పుడూ వినలేదు అని ఆయన అన్నారు.అలాగే ఎన్టీఆర్ దేవర సినిమా గురించి పరుచూరి ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు .ఆది సినిమాలో కనిపించిన ఎన్టీఆర్ ఈ స్థాయికి ఎదగడం చూస్తుంటే ఎంతో సంతోషంగా వుంది.దేవర సినిమా గ్లోబల్ వైడ్ గా భారీ విజయం సాధిస్తుంది.కల్కి ,దేవర రెండు సినిమాలు తెలుగు సినిమా ఖ్యాతిని తారాస్థాయికి తీసుకెళ్తామని ఆయన తెలిపారు.