స్టార్ హీరో ఆది పినిశెట్టి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తన అద్భుతమైన నటన తో తమిళ్ తో పాటు తెలుగు లో కూడా హీరో గా, విలన్ గా పలు సినిమాల లో నటించి తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. తాజాగా ఆది పినిశెట్టి మరియు యాపిల్ బ్యూటీ హన్సిక హీరో హీరోయిన్లుగా నటించిన పార్ట్‌నర్ మూవీ ఓటీటీ లోకి రాబోతుంది.. అక్టోబర్ 6 వ తేదీ నుంచి సింప్లీ సౌత్ ఓటీటీ లో ఈ మూవీ స్ట్రీమింగ్ కానుంది.అయితే కేవలం ఓవర్‌సీస్ ఆడియెన్స్ కు మాత్రమే ఈ సినిమా అందుబాటులో కి రానున్నట్లు సమాచారం.అమెజాన్ ప్రైమ్ ద్వారా త్వరలో తెలుగు, తమిళ ఆడియెన్స్ ముందుకు ఈ సినిమా రాబోతున్నట్లు సమాచారం. తమిళం లో ఆగస్ట్ 25 న విడుదల అయిన ఈ మూవీని తెలుగు లో కూడా అదే టైటిల్‌తో రిలీజ్ చేసే ప్రయత్నాలు చేస్తోన్నారు.
తెలుగు వెర్షన్ థియేటర్ల లో రిలీజ్ కాకముందే తమిళ మూవీ ఓటీటీ లో రిలీజ్ కాబోతుండటం విశేషం.. సైన్స్ ఫిక్షన్ కథాంశానికి కామెడీ ని జోడించి డైరెక్టర్ మనోజ్‌దామోదరన్ పార్ట్‌నర్ మూవీని తెరకెక్కించాడు.ఆది పినిశెట్టి, హన్సిక తో పాటు ఈ సినిమాలో యోగిబాబు కీలక పాత్ర పోషించాడు. టీజర్ మరియు ట్రైలర్ తో ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తించిన ఈ మూవీ డిజాస్టర్ గా నిలిచింది.ఈ సినిమా కథ విషయానికి వస్తే ఓ సైంటిస్ట్ తయారు చేసిన చిప్‌ను తన స్నేహితుడు కళ్యాణ్(యోగిబాబు) తో కలిసి దొంగిలించాలని శ్రీధర్ (ఆది పినిశెట్టి) ప్లాన్ చేస్తాడు. కానీ ఆ చిప్ కారణంగా కళ్యాణ్ అనుకోకుండా అమ్మాయిగా (హన్సిక)గా మారిపోతాడు.. ఆ తర్వాత ఏం అస్సలు జరిగింది.. కళ్యాణ్ తిరిగి అబ్బాయి గా మారతాడా లేదా ఆ తరువాత ఏమి జరుగుతుంది అనేది ఈ సినిమా కథ..