NTV Telugu Site icon

Parliament Session 2024: ప్రతిష్టంభనకు తెర.. నేటి నుంచి సజావుగా పార్లమెంట్ ఉభయసభలు!

Parliament

Parliament

శీతాకాల సమావేశాలు మొదలైనప్పటి నుంచి.. వారం రోజులుగా పార్లమెంటులో నెలకొన్న ప్రతిష్టంభనకు ఎట్టకేలకు తెరపడింది. అదానీ వ్యవహారం, యూపీ సంభల్‌ అల్లర్లు తదితర అంశాలపై చర్చకు విపక్షాలు పట్టుపడుతుండటంతో.. సోమవారం కూడా ఉభయసభలు వాయిదా పడ్డాయి. దాంతో లోక్‌సభ స్పీకర్‌ ఓంబిర్లా అఖిలపక్ష సమావేశం నిర్వహించి.. నేతలతో సుదీర్ఘంగా చర్చించారు. అనంతరం పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్‌ రిజిజు ఓ ప్రకటన చేశారు. మంగళవారం నుంచి ఉభయసభల సమావేశాలూ సజావుగా జరిగేలా సహకరించేందుకు అన్ని పక్షాలూ అంగీకరించాయని తెలిపారు.

రాజ్యాంగం ఆమోదం పొంది 75 ఏళ్లు పూర్తయిన సందర్భంపై డిసెంబర్ 13, 14 తేదీల్లో లోక్‌సభలో.. డిసెంబర్ 16, 17 తేదీల్లో రాజ్యసభలో చర్చ జరగనుందని కిరణ్‌ రిజిజు తెలిపారు. సంభల్ హింస, మణిపుర్‌ అల్లర్లపై నిబంధనల ప్రకారమే నిర్ణయాలు ఉంటాయని చెప్పారు. ఇక నేటి నుంచి పార్లమెంట్ ఉభయసభలు సజావుగా సాగనున్నాయి. సోమవారం అఖిలపక్ష భేటీలో కాంగ్రెస్‌ నుంచి గౌరవ్‌ గొగొయ్, డీఎంకే నుంచి టీఆర్‌ బాలు, తృణమూల్‌ కాంగ్రెస్‌ నుంచి కల్యాణ్‌ బెనర్జీ తదితరులు పాల్గొన్నారు.

Also Read: Travis Head: ఆ భారత బౌలర్‌ను ఎదుర్కొన్నానని.. నా మనవళ్లకు గర్వంగా చెబుతా: హెడ్‌

ఈరోజు ఉదయం 10 గంటలకు ఇండియా కూటమి ఫ్లోర్ లీడర్లు సమావేశం కానున్నారు. పార్లమెంట్ భవనంలో, రాజ్యసభలో ప్రతిపక్ష నేత ఖర్గే కార్యాలయంలో సమావేశం జరగనుంది. అదానీ అంశంపై చర్చించాలని కాంగ్రెస్ పార్టీ కోరుకుంటోంది. బంగ్లాదేశ్లో నెలకొన్న పరిస్థితి, ధరల పెరుగుదల, ద్రవ్యోల్బణం, నిరుద్యోగం, రసాయన ఎరువుల సమస్యల, ప్రతిపక్షాల పాలిత రాష్ట్రాలకు నిధుల కొరత,మణిపూర్-ఈశాన్య రాష్ట్రాల సమస్యలపై చర్చ జరగాలని త్రిణమూల్ కాంగ్రెస్ పార్టీ కోరుకుంటోంది. సంభాల్ హింస, అల్లర్లపై చర్చ జరపాలని సమాజ్ వాది పార్టీ సిద్ధంగా ఉంది. ఢిల్లీలో వాయ కాలుష్యంపై చర్చ జరగాలని ఆమ్ ఆద్మీ పార్టీ కోరుకుంటోంది. పార్లమెంట్ ఉభయ సభలు 5 రోజుల వరుస వాయుదాల వల్ల రూ.45 కోట్లు ఖర్చు వాటిల్లింది.

Show comments