NTV Telugu Site icon

Harish Rao: ఈసారి కూడా మెదక్ గడ్డపై బీఆర్ఎస్ జెండా ఎగురుతుంది: హరీష్ రావు

Harish Rao

Harish Rao

Harish Rao Campaign in Medak: 2004 నుంచి 2019 వరకు మెదక్ గడ్డపై గులాబీ జెండా ఎగురుతూనే ఉందని, ఈసారి కూడా మెదక్ గడ్డపై బీఆర్ఎస్ జెండా ఎగురుతుందని మాజీ మంత్రి హరీష్ రావు ధీమా వ్యక్తం చేసారు. కాంగ్రెస్ పార్టీ పరిస్థితి పాలపొంగు లాగా ఉందని, ఎంత స్పీడ్‌గా కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ పెరిగిందో అంతే వేగంతో పడిపోయిందని విమర్శించారు. కాంగ్రెస్ 100 రోజుల పాలనలో అన్నివర్గాల్ని మోసం చేసిందని, ఏ మొహం పెట్టుకొని ఈ ఎన్నికల్లో ఓట్లు అడుగుతుందని హరీష్ రావు ప్రశ్నించారు. సంగారెడ్డి రుద్రారంలోని సిద్ది గణపతి దేవాలయం ఆవరణలో బీఆర్ఎస్ మెదక్ లోక్‌సభ ఎన్నికల ప్రచార రథాలను ఈరోజు హరీష్ రావు ప్రారంభించారు.

సంగారెడ్డిలో లోక్‌సభ ఎన్నికల ప్రచార రథాలను ప్రారంభించిన అనంతరం మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ… ‘కేసీఆర్ సిరిసిల్లలో వడ్ల బోనస్ గురించి మాట్లాడితే.. సీఎం రేవంత్ రెడ్డి డ్రాయర్ ఉడదీస్తా అంటాడు. నువ్వు సీఎంవా? లేదా చెడ్డి గ్యాంగ్ లీడర్‌వా? రేవంత్ రెడ్డి. ఎలక్షన్స్ ముందు తియ్యగా నోటితో మాట్లాడిన రేవంత్.. ఇప్పుడు నోసిటితో వెక్కిరిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ పరిస్థితి పాలపొంగు లాగా ఉంది. ఎంత స్పీడ్‌గా కాంగ్రెస్ గ్రాఫ్ పెరిగిందో అంతే వేగంతో గ్రాఫ్ పడిపోయింది’ అని అన్నారు.

Also Read: MI vs RCB: ఓటమిని జీర్ణించుకోలేకపోతున్నాం.. అతడే మా కొంపముంచాడు: డుప్లెసిస్‌

‘కాంగ్రెస్ పార్టీ 100 రోజుల పాలనలో అన్నివర్గాల్ని మోసం చేసింది. ఇక ఏ మొహం పెట్టుకొని ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓట్లు అడుగుతుంది. కాంగ్రెస్ అభయహస్తం అక్కరకు రాని హస్తం లాగా తయారయ్యింది. 2004 నుంచి 2019 వరకు మెదక్ గడ్డపై గులాబీ జెండా ఎగురుతూనే ఉంది. ఈ సారి కూడా మెదక్ గడ్డపై బీఆర్ఎస్ జెండా ఎగురుతుంది’ అని మాజీ మంత్రి హరీష్ రావు ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణలోని పార్లమెంట్ నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. మెదక్ లోక్‌సభ నుంచి వెంకట్రామిరెడ్డి పోటీ చేస్తున్న విషయం తెలిసిందే.

Show comments