Paris Olympics 2024: భారత జట్టుకు ఒలింపిక్ కమిటీ షాక్.. సెమీస్ నుంచి కీలక ప్లేయర్ ఔట్!
- భారత హాకీ జట్టుకు షాక్
- సెమీస్ నుంచి రోహిదాస్ ఔట్
- తీవ్రంగా స్పందించిన భారత హాకీ సంఘం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Indian Hockey Player Amit Rohidas Miss semi-finals match against Germany: పారిస్ ఒలింపిక్స్ 2024లో సెమీస్‌కు చేరిన ఆనందంలో ఉన్న భారత హాకీ జట్టుకు ఒలింపిక్ కమిటీ భారీ షాక్ ఇచ్చింది. కీలక ప్లేయర్ అమిత్ రోహిదాస్‌పై కమిటీ ఓ మ్యాచ్ వేటు వేసింది. దాంతో మంగళవారం జర్మనీతో జరిగే సెమీ ఫైనల్ మ్యాచ్‌కు అతడు దూరం అయ్యాడు. ఆదివారం జరిగిన క్వార్టర్స్‌లో ఉద్దేశపూర్వకంగానే బ్రిటన్ ఆటగాడికి స్టిక్ తగిలించాడని డిఫెండర్ రోహిదాస్‌పై ఓ మ్యాచ్ నిషేధం విధించింది.
క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో గోల్ కోసం బ్రిటన్ ప్లేయర్ విల్ కాల్నాన్‌తో అమిత్ రోహిదాస్ పోటీ పడ్డాడు. ఈ క్రమంలో రోహిదాస్ హాకీ స్టిక్.. కల్నాన్ ముఖానికి తాకింది. ఆన్-ఫీల్డ్ రిఫరీ దీనిని తీవ్రమైన నేరంగా పరిగణించడంతో రోహిదాస్ ఎర్ర కార్డు అందుకుని బయటకు వెళ్లాల్సి వచ్చింది. భారత్ 10 మందితోనే బ్రిటన్‌ను ఎదుర్కొని అద్భుత విజయం సాధించింది.తాజాగా రోహిదాస్‌పై వేటు పడటంతో భారత హాకీ సంఘం తీవ్రంగా స్పందించింది. ఇలాంటి ఘటనలతో ఆటగాళ్లలో ఆత్మవిశ్వాసం సన్నగిల్లే ప్రమాదం ఉందని పేర్కొంది. క్రీడ సమగ్రతను నిలబెట్టడానికి, భవిష్యత్‌లో జరగబోయే మ్యాచ్‌లనైనా సరిగ్గా జరిగేలా సమీక్షించాలని కోరింది.
Also Read
Also Read: Amazon Sale 2024: అమెజాన్‌లో మరో సేల్.. డేట్స్, ఆఫర్స్ ఇవే!
ఫుట్‌బాల్, హాకీలో నిబంధనలు వేరుగా ఉంటాయి. ఫుట్‌బాల్‌లో రెడ్ కార్డు అందుకున్న ఆటగాడు తర్వాతి మ్యాచ్ ఆడకుండా నిషేధం పడుతుంది. హాకీలో ముందుగా సాంకేతిక బృందానికి అంపైర్ సంఘటన గురించి నివేదిక అందిస్తాడు. వీడియోను పరిశీలించి.. ఆటగాడు ఉద్దేశపూర్వకంగా తప్పు చేశాడో లేదో అని సాంకేతిక బృందం పరిశీలిస్తుంది. ఆటగాడు ఉద్దేశపూర్వకంగానే ఫౌల్ చేశాడని భావిస్తే.. అతనిపై ఓ మ్యాచ్ నిషేధం పడుతుంది. ఇక సెమీస్‌లో భారత్, జర్మనీ మధ్య మంగళవారం రాత్రి 10.30 గంటలకు మ్యాచ్ ఆరంభం కానుంది.
తాజావార్తలు
-
Pakistan: ఒకవైపు ఇమ్రాన్ ఖాన్‌కు వైద్య పరీక్షలు.. మరోవైపు సోదరి అలీమా అరెస్ట్
-
Babar Azam: ‘శనగలు అమ్మడానికి వచ్చావా..?’ పాపం బాబర్ ఆజం పరువుపోయిందిగా..
-
AAS SGP : సచివాలయ ఉద్యోగులకు ఏపీ సర్కార్ గుడ్‌న్యూస్..
-
Drugs Seized : ఒడిశా టూ హైదరాబాద్ ‘డెడ్ డ్రాప్’ డ్రగ్స్ నెట్వర్క్ గుట్టురట్టు
-
Mohammed Siraj: కెప్టెన్‌గా మహ్మద్ సిరాజ్ ఎంపిక.. అక్టోబర్ 11న తొలి మ్యాచ్..
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!