NTV Telugu Site icon

Pariksha Pe Charcha: పిల్లలపై ఒత్తిడి చేయొద్దు… పరీక్ష పే చర్చలో ప్రధాని మోదీ

Pariksha Pe Charcha

Pariksha Pe Charcha

Pariksha Pe Charcha: ‘పరీక్ష పే చర్చ’ తనకు కూడా పరీక్ష అని, దేశంలోని కోట్లాది మంది విద్యార్థులు తన పరీక్షకు హాజరవుతున్నారని ప్రధాని నరేంద్ర మోడీ శుక్రవారం అన్నారు.’పరీక్ష పే చర్చ’ నాకు పరీక్ష.. దేశంలోని కోట్లాది మంది విద్యార్థులు నా పరీక్షకు హాజరవుతున్నారు.. ఈ పరీక్షను ఇవ్వడం నాకు చాలా ఆనందంగా ఉంది’ అని ఢిల్లీ నుంచి ‘పరీక్ష పే చర్చ’ 6వ ఎడిషన్‌లో విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులతో సంభాషిస్తూ ప్రధాని మోదీ అన్నారు.

తల్లిదండ్రులు తమ పిల్లల నుంచి ఆశించడం సహజమేనని.. అది కేవలం సోషల్ స్టేషస్ కాపాడుకోవడం కోసమే అయితే అది ప్రమాదకరమని మోదీ అన్నారు. సామాజిక ఒత్తిడి కారణంగా తమ పిల్లలను బాగా చదవాలంటూ ఒత్తిడి చేస్తే అది సమస్యగా మారుతుందన్నారు. తాము రాజకీయాల్లో ఉన్నామని.. ఇక్కడ విజయం కోసం భారీ ఒత్తిడి ఏర్పడుతుందన్నారు. మీరు సామర్థ్యంతో అంచనాలను సరిపోల్చాలని విద్యార్థుల తల్లిదండ్రులకు ప్రధాని మోడీ సూచించారు. పిల్లలు ఆందోళన చెందవద్దని, పరీక్షల రోజుల్లో ఒత్తిడికి గురికాకుండా, ఉల్లాసంగా ఉండడంతో పాటు ఉత్తమమైన వాటిని వారికి అందించడానికి కృషి చేయాలని ఆయన కోరారు.

Padma Shri: పాములు పట్టేవారిని వరించిన ప్రతిష్ఠాత్మక పురస్కారం

టైమ్ మేనేజ్‌మెంట్ సమస్యను ప్రస్తావిస్తూ.. పరీక్షలకే కాదు, జీవితంలోని ప్రతి దశలోనూ టైమ్ మేనేజ్‌మెంట్‌పై అవగాహన కలిగి ఉండాలన్నారు. మీరు అలాంటి టైమ్‌ మేనేజ్‌ స్లాబ్‌ను రూపొందించుకోవాలన్నారరు. మొదట తక్కువ ఇష్టపడే సబ్జెక్ట్‌కు సమయం ఇవ్వాలని.. ఆపై మిగిలిన సమయాన్ని ఎక్కువ ఇష్టపడే సబ్జెక్ట్‌కు ఇవ్వాలని ప్రధాని విద్యార్థులకు సూచించారు. తల్లి టైమ్‌ మేనేజ్‌మెంట్ నైపుణ్యాలను ఎప్పుడైనా గమనించారా అంటూ ఆయన విద్యార్థులను ప్రశ్నించారు. తల్లి పనిని ఎన్నటికీ భారంగా భావించదని పిల్లలకు ఆయన చెప్పారు. మీ తల్లిని గమనిస్తే సమయాన్ని ఎలా వినియోగించుకోవాలో అర్థమవుతుందని విద్యార్థులనుద్దేశించి ప్రధాని అన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలపై ఒత్తిడి చేయవద్దని ఆయన కోరారు. కానీ అదే సమయంలో, విద్యార్థులు తమ సామర్థ్యాలను కూడా తక్కువ అంచనా వేయకూడదన్నారు. “ఒత్తిడిలో ఉండకండి! ఆలోచించండి, విశ్లేషించండి, చర్య తీసుకోండి, ఆపై మీరు కోరుకున్నది సాధించడానికి మీ వంతు కృషి చేయండి” అని ప్రధాని మోదీ అన్నారు.

Weather Forecast: ఉదయం చలి.. మధ్యాహ్నం వేడి.. ఏమిటీ పరిస్థితి..

పరీక్ష పే చర్చ 6వ ఎడిషన్ న్యూఢిల్లీలోని తల్కతోరా ఇండోర్ స్టేడియంలో జరిగింది.ఈ సంవత్సరం 38 లక్షల మంది విద్యార్థులు పరీక్షా పే చర్చలో పాల్గొనడానికి నమోదు చేసుకున్నారు, వారిలో 16 లక్షల మందికి పైగా రాష్ట్ర బోర్డుల నుంచి వచ్చారు. పరీక్షల్లో పలు పద్ధతులను ఉపయోగించడంపై ప్రధాని మోదీ మాట్లాడారు.మోసం ఎవరికైనా ఒకటి లేదా రెండు పరీక్షల్లో సహాయపడవచ్చు, కానీ దీర్ఘకాలంలో జీవితంలో కాదని, షార్ట్‌కట్‌ను ఎప్పుడూ తీసుకోవద్దు, విద్యార్థుల కష్టపడి జీవితంలో ముందుకు సాగడానికి ఎల్లప్పుడూ సహాయపడుతుందని ఆయన అన్నారు.విద్యార్థులు తమ బలాన్ని తక్కువ అంచనా వేస్తున్నారో లేదో తెలుసుకోవడానికి వారిపై విధించిన ఒత్తిడిని ఎప్పటికప్పుడు విశ్లేషించుకోవాలని ఆయన అన్నారు.