NTV Telugu Site icon

Parents killed Son: దారుణం.. డబ్బు కోసం కుమారుడిని చంపిన తల్లిదండ్రులు.. ఎక్కడంటే?

Killed Image

Killed Image

జార్ఖండ్‌లోని రాంచీలో దారుణ ఘటన వెలుగు చూసింది. ఇక్కడ డబ్బు కోసం తల్లిదండ్రులు తమ కుమారుడిని హత్య చేశారు. విషయం ఠాకూర్‌గావ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పట్రాటు గ్రామంలో చోటుచేసుకుంది. మంగళవారం అర్ధరాత్రి ఇక్కడ ఓ యువకుడిని అతని తండ్రి, సవతి తల్లి కలిసి చంపేశారు.

READ MORE: Ram Gopal Varma: ఆర్జీవీపై వరుస ఫిర్యాదులు.. మరో కేసు నమోదు..

పోలీసుల వివరాల ప్రకారం.. పట్రాటు గ్రామానికి చెందిన ఫులేశ్వర్ పహాన్, అతని మూడో భార్య సునీతాదేవి మద్యం తాగి తమ కుమారుడిని డబ్బులు డిమాండ్ చేస్తున్నట్టు సమాచారం. అతను డబ్బు ఇవ్వడానికి నిరాకరించడంతో వారిద్దరూ తమ 25 ఏళ్ల కుమారుడు మదన్ పహాన్ తలపై గుడ్డ కప్పి పిస్టల్‌లో కాల్చేశారు. దీంతో యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. ఘటనకు పాల్పడిన తర్వాత నిందితులిద్దరూ పరారయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు హత్యకు ఉపయోగించిన పిస్టల్‌ను స్వాధీనం చేసుకున్నారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని మిగతా కుటుంబ సభ్యులకు అప్పగించారు. నిందితులిద్దరినీ పట్టుకునేందుకు పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. కాగా.. మదన్ పంజాబ్‌లోని ఓ పౌల్ట్రీ ఫామ్‌లో చాలా ఏళ్లుగా పనిచేశాడు. నెల రోజుల క్రితం ఇంటికి వచ్చాడు.

READ MORE:Patnam Narender Reddy Wife: పోలీసులపై చర్యలు తీసుకోండి.. హైకోర్టులో పట్నం శృతి పిటిషన్..

మదన్ పహాన్ వివాహం రామ్‌గఢ్‌లోని పట్రాటులో నిశ్చయమైంది. బుధవారం ఎంగేజ్‌మెంట్ వేడుక ఉంది. గ్రామస్థుల కథనం ప్రకారం.. నిందితుడు ఫులేశ్వర్ పహాన్ మూడు పెళ్లిళ్లు చేసుకున్నాడు. అతనికి మొదటి భార్యకు వివాహమైన ఒక కుమార్తె ఉంది. మదన్ అతని రెండవ భార్య కుమారుడు. ఇద్దరు భార్యల మరణానంతరం నిందితుడు ఫులేశ్వర్ పహాన్ సునీతాదేవిని మూడో పెళ్లి చేసుకున్నాడు. ఆమెకు కూడా ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు.

Show comments