Site icon NTV Telugu

SK : శివకార్తికేయన్, శ్రీలీల, సుధాకొంగర, జయం రవికి పెను సవాల్ గా మారిన ‘పరాశక్తి’

Parashakti

Parashakti

అమరన్‌తో రూ. 300 కోట్లను కొల్లగొట్టి జోష్ మీదున్న శివకార్తీకేయన్ వద్దకు వచ్చిన ప్రాజెక్టే పరాశక్తి. ఆకాశమే నీ హద్దురాకు జాతీయ స్థాయి గుర్తింపు రావడంతో సూర్యతో తొలుత ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసింది సుధాకొంగర. సూర్య 43గా ఎనౌన్స్ మెంట్ రాగా హీరోకు దర్శకురాలికి మధ్య క్రియేటివ్ డిఫరెన్స్ రావడం వల్ల ఆగిపోయింది. తర్వాత ఇదే కథను శివకు చెప్పి ఓకే చేయించుకుంది లేడీ డైరెక్టర్. లాస్ట్ ఇయర్ పట్టాలెక్కిన పరాశక్తి శివకార్తీకేయన్ కెరీర్‌లో కీలకమైన ఫిల్మ్. ఇది ఆయన 25వ చిత్రంగా రాబోతుంది.

Also Read : OTT : ఈ వారం ఓటీటీ సినిమాలు ఇవే

అమరన్ తో ఊహించిన హిట్టు కొట్టిన శివ కార్తికేయన్ కు మదరాసి ఝలక్ ఇచ్చింది. మురుగదాస్ డైరెక్ట్ చేసిన ఆ సినిమా ప్లాప్ గా నిలిచింది. ఇప్పుడు పరాశక్తితో మరోసారి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాల్సిన తరుణం. అలాగే ఆకాశమే నీ హద్దురాను హిందీలో సర్ఫిరాగా రీమేక్ చేసి చేతులు కాల్చుకున్న సుధాకొంగర ఖాతాలో అర్జెంటుగా హిట్ పడాల్సిన తరుణం. సూర్య ఈ ప్రాజెక్ట్ నుండి ఎందుకు తప్పుకున్నాన అని ఫీలయ్యేలా చేయాల్సిన సిచ్యుయేషన్ ఆమెది.  2026 సంక్రాంతికి రిలీజౌతున్న పరాశక్తి హిట్ కొట్టడం ఈ ముగ్గురికే కాదు. మరికొందరికి అత్యవసరం. పరాశక్తితో కోలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న టాలీవుడ్ సోయగం శ్రీలీల ప్లాపుల పరంపరకు అడ్డుకట్ట పడాల్సిన సిచ్యుయేషన్. అలాగే మ్యూజిక్ డైరెక్టర్ జీవీ ప్రకాష్ కు కూడా మైల్ స్టోన్ మూవీ. సంగీత దర్శకుడిగా పరాశక్తి ఆయనకు 100వ చిత్రం. ఇక జయం రవి నెగిటివ్ షేడ్ లో నిరూపించుకోవాల్సిన పరిస్థితి. ఇలా మెయిన్ కాస్ట్ అండ్ క్రూకు పెను సవాళ్లే ఉన్నాయి. నెక్ట్స్ సంక్రాంతికి టఫ్ కాంపీటీషన్ ఉన్నప్పటికీ బరిలోకి దిగుతున్న ఈ సినిమా వీళ్ల హోప్స్ నిలబెడుతుందో లేదో లెస్ట్ వెయిట్..

Exit mobile version