Papikondalu Boating: 70 రోజుల విరామం.. నేటి నుంచి పాపికొండలు విహారయాత్ర!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Papikondalu Boating Begins Today: గోదావరి వరదల నేపథ్యంలో నిలిచిపోయిన పాపికొండల విహారయాత్ర నేటి నుంచి తిరిగి ప్రారంభమవుతుంది. సుమారు 70 రోజుల విరామం తర్వాత పర్యాటక బోట్లకు అధికారులు అనుమతులు జారీ చేశారు. పోలవరం జిల్లా దేవీపట్నం మండలంలోని గండిపోశమ్మ ఆలయం నుంచి పాపికొండలకు 16 టూరిజం బోట్లు ప్రయాణించనున్నాయి. ఏపీటీడీసీకి చెందిన ఓ బోట్, 15 ప్రైవేట్ బోట్లను విహారయాత్రకు సిద్ధంగా ఉంచారు.
గోదావరిలో వరద ఉద్ధృతి కారణంగా జులై 30 నుంచి బోటు ప్రయాణాలను నిలిపివేశారు. రెండు రోజుల క్రితం గోదావరి తగ్గుముఖం పట్టింది. ప్రస్తుతం పరిస్థితులను పరిశీలించిన అనంతరం పాపికొండల విహారయాత్రకు అనుమతిస్తూ రంపచోడవరం సబ్ కలెక్టర్ పృథ్వీరాజ్ కుమార్ ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు 2026 దసరా సెలవులు కొనసాగుతుండటంతో.. పాపికొండలను సందర్శించేందుకు పెద్ద సంఖ్యలో పర్యాటకులు వచ్చే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. దీంతో పర్యాటక ప్రాంతంలో సందడి నెలకొంటుంది. బోట్ పాయింట్ వద్ద అధికారులు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేశారు.
Also Read
తాజావార్తలు
-
Papikondalu Boating: 70 రోజుల విరామం.. నేటి నుంచి పాపికొండలు విహారయాత్ర!
-
Vaibhav sooryavanshi: నాలుగో టీ20లో వైభవ్ సూర్యవంశీ..? వైరల్ గా మారిన పోస్ట్.!
-
Breaking Bad Actor: ‘బ్రేకింగ్ బ్యాడ్’ నటుడు ఆర్జే మిట్టే హఠాన్మరణం
-
AP Weather Update: ఏపీకి 4 రోజుల పాటు వర్ష సూచన!
-
New Mobile Launched: ఫోన్ ఛార్జింగ్ త్వరగా అయిపోతుందా.. ఈ కొత్త ఫోన్‌తో పరిష్కారం దొరికినట్లే..
ట్రెండింగ్
-
7 రోజుల బ్యాటరీ, ECG, GPSతో Google Fitbit Edge లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
-
Rishabh Pant Ruled Out: రిషబ్ పంత్ అవుట్.. కీలక ప్లేయర్ ఇన్.!
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!