Super Sketch: తన ప్రేమను ఇంట్లో వాళ్లు ఒప్పుకోకపోవడంతో ప్రియుడి కోసం ఓ మహిళ భలే స్కెచ్ వేసింది. ప్రియుడితో వెళ్లి సంతోషంగా జీవించాలనుకుంది. అందుకు తాను చనిపోయినట్లు ఇంట్లో వాళ్లని నమ్మించాలనుకుంది. అందుకు తన స్నేహితురాలి ప్రాణం తీసింది. ఈ ఘటన హర్యానా రాష్ట్రంలో చోటు చేసుకుంది. ప్రియుడితో పారిపోయేందుకు ప్రియురాలు ప్లాన్ వేసింది. ఇంట్లో వాళ్లు తను చనిపోయిందనుకోవాలని తన లాగే ఉండే మరో యువతి ప్రాణం తీసింది. ఈ ఘటన 2017 సెప్టెంబర్ 5న జరగింది, కానీ ఇప్పుడు వెలుగులోకి వచ్చింది.
Read Also: Mosquito Coil : ఆరుగురిని బలి తీసుకున్న మస్కిటో కాయిల్
పానిపట్ కు చెందిన జ్యోతి, కృష్ణ కుమార్ ప్రేమించుకుంటున్నారు. పెళ్లి చేసుకుని జీవితాంతం కలిసి ఉండాలనుకున్నారు. వారి ప్రేమ విషయం ఇంట్లో వాళ్లకు చెప్పారు. కానీ వారి ప్రేమకు పెద్దలు అంగీకారం తెలపలేదు. ముఖ్యంగా జ్యోతి ఇంట్లో వాళ్లు వీరి పెండ్లికి ససేమీరా అన్నారు. దీంతో ఇద్దరూ ఇంట్లో నుంచి వెళ్లిపోయి పెండ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. వెంటనే ఓ టీవీ సీరియల్ గుర్తుకు వచ్చింది. దాని ఆధారంగా వారిద్దరు ప్లాన్ వేశారు. కుటుంబ సభ్యులకు అనుమానం రాకుండా ఉండేందుకు.. జ్యోతిలానే కనిపించే మరో యువతిని హత్య చేయాలని నిర్ణయించుకున్నారు. అనుకున్నదే తడువుగా జ్యోతి తన స్నేహితురాలైన సిమ్రన్‌ను స్థానికంగా ఉన్న జీటీ రోడ్డుకు పిలిపించింది. సిమ్రన్‌ను మాటల్లో పెట్టి మత్తు మందు కలిపిన కూల్‌డ్రింక్ తాగించింది. మత్తులోకి జారుకున్నాక గొంతు కోసి చంపేసింది. అనంతరం ఎవరికీ అనుమానం రాకుండా సిమ్రన్ దుస్తులు మార్చి.. ఆ స్థలంలో జ్యోతికి సంబంధించిన గుర్తింపు కార్డులను పడేసి ప్రేమికులిద్దరూ అక్కడి నుంచి పారిపోయారు.
Read Also:Bengaluru: పార్కు నుంచి ఈడ్చుకెళ్లి.. కదిలే కారులో యువతిపై గ్యాంగ్ రేప్
మృతదేహంపై ఉన్న దుస్తులు, వస్తువుల ఆధారంగా చనిపోయింది జ్యోతినే అని భావించిన కుటుంబ సభ్యులు అంత్యక్రియలు పూర్తి చేశారు. మరోవైపు సిమ్రన్ కనిపించకపోవడంతో ఆందోళన చెందిన ఆమె కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్నారు. సిమ్రన్ కోసం గాలింపు చేపట్టారు. కేసు విచారణ సందర్భంగా యువతి హత్య తాలుకా ఫోటోలను ఆమె తల్లిదండ్రులకు చూపించగా మెడకున్న దారం, ముక్కుపుడక ఆధారంగా సిమ్రన్ అని గుర్తించారు. దీంతో పారిపోయిన జ్యోతి, కృష్ణలను వెతికే పనిలో పడ్డ పోలీసులు.. వారిని గుర్తించి, 2020లో అదుపులోకి తీసుకున్నారు. కేసు కోర్టు పరిధిలో ఉండగానే కృష్ణ జైలులోనే క్షయవ్యాధితో చనిపోయాడు. ఈ ఘటనపై తీర్పు చెప్పిన పానిపట్ కోర్టు.. జ్యోతికి జీవితఖైదు విధించింది.
