Pandu Mirapakaya Pachadi: ఏడాది పాటు నిల్వ ఉండే టేస్టీ ‘పండు మిరపకాయ పచ్చడి’.. ఈ కొలతలు ఫాలో అయితే చాలు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pandu Mirapakaya Pachadi: ఎన్నో రకాల పచ్చళ్లలో పండు మిరపకాయ పచ్చడి రుచి ప్రత్యేకంగా ఉంటుందనడంలో ఎటువంటి డౌట్ లేదు. వేడి వేడి అన్నంలో కాస్త నెయ్యి, ఈ పచ్చడి వేసుకుని తింటే ఆ రుచి మరచిపోలేరు. ముఖ్యంగా సరైన కొలతలతో, తడి లేకుండా తయారు చేస్తే ఈ పచ్చడి సంవత్సరం పాటు తాజాగా నిల్వ ఉంటుంది. మరి పక్కా కొలతలతో పండు మిరపకాయ పచ్చడి ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
కావాల్సిన పదార్థాలు:
* పండు మిరపకాయలు – ½ కేజీ
* చింతపండు (గింజలు, పీచు లేనిది) – 125 గ్రాములు
* ఉప్పు – 125 గ్రాములు
* పసుపు – 1 టీస్పూన్
* వెల్లుల్లి రెబ్బలు – ¼ కప్పు
* నువ్వుల నూనె లేదా వేరుశనగ నూనె – 150 మి.లీ.
* మెంతుల పొడి – 1 టీస్పూన్
* ఆవాల పొడి – 1 టీస్పూన్
Also Read
- Turkey-Netanyahu: నెతన్యాహును టార్గెట్ చేసిన టర్కీ.. ఇంటర్‌పోల్‌కు కీలక అభ్యర్థన
- Drugs Control Department: “UP TO 60%/70%/80% DISCOUNT” బోర్డులు.. ఫార్మసీలకు డ్రగ్స్ కంట్రోల్ సీరియస్ వార్నింగ్
- Rahul Gandhi: పెల్లెట్ గన్ ఘటనపై రాహుల్ గాంధీ ధర్నా.. ఎట్టకేలకు ఎఫ్ఐఆర్ నమోదు
- India Forex Reserves: విదేశీ మారకద్రవ్య నిల్వల్లో భారత్‌కు బిగ్ బూస్ట్.. బంగారం నిల్వలు కూడా భారీ పెరుగుదల..
తాలింపు కోసం:
* వెల్లుల్లి రెబ్బలు – 10
* ఎండుమిర్చి – 5
* ఆవాలు – 2 టీస్పూన్లు
* జీలకర్ర – 2 టీస్పూన్లు
* కరివేపాకు – తగినంత
* ఇంగువ – ¼ టీస్పూన్
తయారీ విధానం:
ముందుగా పండు మిరపకాయలను శుభ్రంగా కడిగి, తడి లేకుండా పూర్తిగా ఆరబెట్టాలి. ఒక్క చుక్క నీరు కూడా లేకుండా చూసుకోవాలి. తర్వాత వాటి తొడిమలు తీసి చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్లో చింతపండు, ఉప్పు వేసి మెత్తగా పొడి చేసుకోవాలి. ఆ తర్వాత అందులో మిరపకాయ ముక్కలు వేసి పూర్తిగా మెత్తగా కాకుండా కొద్దిగా బరకగా గ్రైండ్ చేయాలి. తరువాత పసుపు, వెల్లుల్లి రెబ్బలు వేసి ఒకసారి మాత్రమే పల్స్ చేయాలి. వెల్లుల్లి పూర్తిగా మెత్తగా కాకుండా ఉండేలా చూసుకోవాలి. ఈ మిశ్రమాన్ని శుభ్రమైన గాజు జాడీలో వేసి మూతపెట్టి 24 గంటల పాటు ఊరనివ్వాలి. ఇలా ఉంచడం వల్ల పచ్చడికి మంచి రుచి వస్తుంది.
మరుసటి రోజు పాన్‌లో నువ్వుల నూనె లేదా వేరుశనగ నూనె వేడి చేసి.. వెల్లుల్లి, ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఇంగువ వేసి తాలింపు చేయాలి. ఆ తర్వాత ఊరబెట్టిన పచ్చడిని వేసి సిమ్ మంటపై సుమారు ఐదు నిమిషాలు కలుపుతూ ఉడికించాలి. చివరగా మెంతుల పొడి, ఆవాల పొడి వేసి బాగా కలిపి నూనె పైకి తేలిన తర్వాత స్టవ్ ఆఫ్ చేయాలి. పూర్తిగా చల్లారిన తర్వాత జాడీలో నిల్వ చేసుకోవాలి.
పచ్చడి ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే..
పచ్చడి తయారీలో ఉపయోగించే గిన్నెలు, మిక్సీ జార్, చెంచాలు, జాడీ పూర్తిగా పొడిగా ఉండాలి. ½ కేజీ మిరపకాయలకు 125 గ్రాముల చింతపండు, 125 గ్రాముల ఉప్పు సరైన కొలత ఉండేలా చూసుకోండి. నిల్వ పచ్చళ్లకు నువ్వుల నూనె లేదా వేరుశనగ నూనె మాత్రమే ఉపయోగిస్తే ఎక్కువ రోజులు తాజాగా ఉంటుంది. ముఖ్యంగా పచ్చడి పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే గాజు జాడీలో నిల్వ చేయాలి. ఇలా చేస్తే సంవత్సరం పాటు రంగు, రుచి మారకుండా ఉంటుంది.
తాజావార్తలు
-
Turkey-Netanyahu: నెతన్యాహును టార్గెట్ చేసిన టర్కీ.. ఇంటర్‌పోల్‌కు కీలక అభ్యర్థన
-
Drugs Control Department: “UP TO 60%/70%/80% DISCOUNT” బోర్డులు.. ఫార్మసీలకు డ్రగ్స్ కంట్రోల్ సీరియస్ వార్నింగ్
-
Rahul Gandhi: పెల్లెట్ గన్ ఘటనపై రాహుల్ గాంధీ ధర్నా.. ఎట్టకేలకు ఎఫ్ఐఆర్ నమోదు
-
Bandi Sanjay : యోగితో బండి సంజయ్ భేటీ.. తెలంగాణపై కీలక చర్చ.!
-
India Forex Reserves: విదేశీ మారకద్రవ్య నిల్వల్లో భారత్‌కు బిగ్ బూస్ట్.. బంగారం నిల్వలు కూడా భారీ పెరుగుదల..
ట్రెండింగ్
-
18 రోజుల బ్యాటరీ, 140+ స్పోర్ట్స్ మోడ్స్, AMOLED డిస్ప్లేతో Redmi Watch 6 Active లాంచ్..!
-
Kitchen Hacks: చాకు పదును పోయిందా? కొత్తది కొనాల్సిన పనిలేదు.. ఈ సింపుల్ ట్రిక్స్‌తో ఇంట్లోనే పదును పెట్టండి..!
-
Blood Donation: రక్తదానం ఎవరు చేయొచ్చు? ఎవరు చేయకూడదు? ఒకవేళ రక్తదానం చేస్తే ఏమైనా సమస్యలు ఎదురవుతాయా.?
-
IND vs SL 2nd Test: రెండో టెస్ట్ నుంచి కుల్దీప్ యాదవ్ ఔట్.. 33 ఏళ్ల దేశవాళీ కింగ్‌కు ఛాన్స్?
-
16:9.5 యాస్పెక్ట్ రేషియో వైడ్ స్క్రీన్‌తో ప్రపంచంలోనే తొలి క్యాండీబార్ ఫోన్ Huawei Pura X View..!