Site icon NTV Telugu

Karnataka CM : హస్తినకు చేరిన కర్ణాటక సీఎం పంచాయితీ

Karnataka

Karnataka

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో 135 నియోజకవర్గాల్లో ఘన విజయం సాధించిన కాంగ్రెస్ పార్టీలో వర్గవిభేదాలు కొనసాగుతునే ఉన్నాయి. కర్ణాటక కాంగ్రెస్ పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్, మాజీ ముఖ్యమంత్రి సిద్దరామయ్యల మధ్య సీఎం కూర్చి కోసం పంచాయితీ నడుస్తుంది. అయితే దీనిపై కాంగ్రెస్ అధిష్టానం మాత్రం సీఎం అభ్యర్థి కోసం నేరుగా దూతలను రంగంలోకి దించింది. దీంతో హైకమాండ్ ఆదేశాలతో కర్ణాటకకు వచ్చిన నేతలు డీకే శివ కుమార్, సిద్దరామయ్యతో చర్చలు జరిపారు.

Also Read : TFCC: దుబాయ్ లో నంది అవార్డుల ప్రదానం ఎప్పుడంటే….

కానీ.. డీకే శివ కుమార్ , సిద్దరామయ్య మధ్య చర్చలు సఫలం కాకపోవడంతో కాంగ్రెస్ పరిశీలకులు తిరిగి ఢిల్లీకి వెళ్లి పోయారు. దీనిపై ఇరువురు నేతలు హస్తినకు రావాల్సిందిగా కాంగ్రెస్ అధిష్టానం కబురు పంపించింది. అయితే ఉదయం సిద్దరామయ్య ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. ఆయన ఇవాళ సాయంత్రం రాహుల్ గాంధీతో భేటీ కానున్నారు. ఇప్పటికే డీకే శివ కుమార్ బుజ్జగించేందుకు దాదాపు 3 గంటల పాటు సూర్జేవాలా సింగ్ ప్రయత్నం చేసిన చర్చలు ఫలించలేదు.

Also Read : Devendra Fadnavis : కావాలనే రాష్ట్రంలో అల్లర్లు సృష్టిస్తున్నారు..

అయితే డీకే శివ కుమార్ మాత్రం తనకు ఇస్తే సీఎం పదవి.. లేకపోతే కేబినెట్ లో స్థానం కూడా వద్దంటున్నారు. ప్రస్తుతం డీకే శివ కుమార్ తన ఫామ్ హౌస్ లోనే ఉన్నారు. పార్టీ కోసం కష్టపడి రాష్ట్రమంత తిరిగి పార్టీని గెలిపించానని కేపీసీసీ చీఫ్ శివ కుమార్ తన సన్నిహితులతో చెప్పినట్లు తెలుస్తోంది. అయితే మరోవైపు ముఖ్యమంత్రి పదవి తనకే వస్తుందని ఆశాభావంతో సిద్ధరామయ్య ఉన్నారు. సీఎం అభ్యర్థిగా ఎవరు అనేది అంతిమ నిర్ణయం కాంగ్రెస్ అధిష్టానానిదే అంటూ సిద్ధరామయ్య తెలిపారు. కాసేపట్లో మల్లిఖార్జున ఖర్గేతో ఏఐసీసీ పరిశీలకుల బృందం భేటీకానుంది.

Also Read : Prabhas: ప్రభాస్ ప్యూర్ లవ్‌స్టోరీ? అంత రిస్క్ అవసరమా అధ్యక్షా?

కర్ణాటక ఎపిసోడ్‌పై కొనసాగుతున్న సస్పెన్స్‌. డికే శివకుమార్‌ ఢిల్లీ పర్యటనపై ఉత్కంఠ కొనసాగుతుంది. మద్దతుదారులతో కేపీసీసీ డీకే శివకుమార్‌ సమావేశమయ్యారు. ఢిల్లీ వెళ్లేందుకు ప్రత్యేక విమానాన్ని డీకే టీమ్ సిద్ధంగా ఉంచింది. ఇప్పటికే ఢిల్లీలో సిద్ధరామయ్య ఉన్నారు. సీఎం సీటు కోసం సిద్దరామయ్య, డీకే శివకుమార్‌ మధ్య గట్టిపోటీ నడుస్తుంది.

Exit mobile version