టాలీవుడ్ లో ప్రస్తుతం పాన్ ఇండియా రేంజ్ లో మూవీస్ తెరకెక్కుతున్నాయి.ఆర్ఆర్ఆర్ సినిమాతో దర్శక ధీరుడు రాజమౌళి మల్టీ స్టారర్ మూవీస్ కి ఒక దారి క్రియేట్ చేసారు.ఆర్ఆర్ఆర్ సినిమాతో రాంచరణ్,ఎన్టీఆర్ కాంబినేషన్ కి ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ లభించింది.దీనితో టాలీవుడ్ లో మల్టీ స్టారర్ హవా మొదలైంది.తాజాగా క్రేజీ మల్టీ స్టారర్ మూవీస్ తెరకెక్కుతున్నాయి..ధనుష్- నాగార్జున కలిసి నటిస్తున్నకుబేర సినిమా హృతిక్ రోషన్,ఎన్టీఆర్ కాంబినేషన్ లో వస్తున్న వార్ 2 వంటి సినిమాలపై ప్రేక్షకులలో భారీగా అంచనాలు వున్నాయి.ఇదిలా ఉంటే మరో క్రేజీ కాంబినేషన్ లో బిగ్గెస్ట్ మల్టీ స్టారర్ మూవీ రాబోతుంది. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, కోలీవుడ్ స్టార్ హీరో సూర్య కాంబినేషన్ లో బిగ్గెస్ట్ మల్టీ స్టారర్ మూవీ రాబోతున్నట్లు సోషల్ మీడియాలో ఓ వార్త తెగ వైరల్ అవుతుంది. అలాగే ఈ బిగ్గెస్ట్ మల్టీ స్టారర్ మూవీని కంగువ దర్శకడు శివ తెరకెక్కిస్తారని ప్రచారం సాగుతోంది.
కంగువ తర్వాత శివ చేయబోయే బిగ్గెస్ట్ సినిమా ఇదేనంటూ ఓ వార్త తెగ వైరల్ అవుతుంది.ప్రస్తుతం దర్శకుడు శివ సూర్యతో కంగువ సినిమా తెరకెక్కిస్తున్నారు.కంగువ సినిమాపై ప్రేక్షకులలో భారీ అంచనాలు ఉండటంతో ఈ కాంబో తెరపైకి వచ్చినట్లు సమాచారం..రాంచరణ్,సూర్య వంటి బిగ్ స్టార్స్ తో సినిమా చేయడం అంత సులువు కాదు.ఇద్దరి ఇమేజ్ ని బేస్ చేసుకుని కథ సిద్ధం చేయాలి.అలాగే పాన్ ఇండియా రేంజ్ లో సినిమా తీయాలంటే ఇద్దరి హీరోలను బ్యాలెన్స్ చేస్తూ అద్భుతమైన స్టోరీ ,స్క్రీన్ ప్లే కావాలి..ఇవ్వన్నీ చూసుకుంటే మాత్రం ఈ కాంబినేషన్ లో సినిమా రావడం కష్టమే అని తెలుస్తుంది.ఎందుకంటే ప్రస్తుతం రాంచరణ్ ,సూర్య వరుస సినిమాలతో బిజీ గా వున్నారు.ఈ సినిమాలు పూర్తికావడానికి చాలా సమయం పడుతుంది.మరి వారి కమిట్మెంట్స్ ని కాదనుకొని ఈ సినిమా చేస్తే తప్ప ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లే ఛాన్స్ లేదు.