నయా సెన్సేషనల్ హీరో ప్రదీప్ రంగనాథన్ అరుదైన రికార్డ్ సాధించాడు. హీరో మెటీరియల్ కాదు అన్న అవమానాలు అధిగమించి ఇప్పుడు ఏ యంగ్ హీరో సాధించని హ్యాట్రిక్ హండ్రెడ్ క్రోర్ హీరో అయ్యాడు. రీసెంట్లీ ప్రేక్షకుల ముందుకు వచ్చిన డ్యూడ్ కూడా వంద కోట్ల క్లబ్‌లోకి చేరిపోయింది. దీపావళికి రిలీజైన ఈ సినిమా వారం రోజులు గడవక ముందే ఈ రికార్డ్ సాధించింది. ఈ ఏడాదిలో ప్రదీప్ ఖాతాలో ఇది సెకండ్ హండ్రెడ్ క్రోర్ ఫిల్మ్స్. ఎలాంటి అంచనాలు లేకుండా ఫిబ్రవరిలో వచ్చిన డ్రాగన్ రూ. 150 కోట్లను కొల్లగొట్టింది. ఫస్ట్ ఫిల్మ్ ‘లవ్ టుడే’ వంద కోట్లను వసూళ్లు చేసింది. దీంతో ఫస్ట్ త్రీ మూవీస్‌లో వరుసగా హండ్రెడ్ క్రోర్ చొప్పున వసూళ్లు సాధించిన వన్ అండ్ ఓన్లీ హీరోగా హిస్టరీ క్రియేట్ చేశాడు ఈ జూనియర్ ధనుష్.
Also Read : SPIRIT : రెబల్ ఫ్యాన్స్ కు సందీప్ రెడ్డి ‘స్పిరిట్’ గిఫ్ట్..
షార్ట్ ఫిల్మ్స్ నుండి డైరెక్టరైన ప్రదీప్ కోబలితో తానేంటో ఫ్రూవ్ చేసుకున్నాడు. దర్శకుడి నుండి హీరోగా యూటర్న్ తీసుకుని సక్సెస్ అయ్యాడు. స్క్రిప్ట్ సెలక్షన్ అంటే ఇది అని తమిళ స్టార్ హీరోలకు లెసన్స్ నేర్పుతున్నాడు. ప్రజెంట్ కోలీవుడ్‌లో ప్రదీప్ పేరు మార్మోగిపోతుంది. ఇటు తెలుగులోనూ యూత్‌లో క్రేజ్ సంపాదించాడు జూనియర్ ధనుష్. ఈ విజయాల వెనుక తన కష్టంతో పాటు ఓ సెంటిమెంట్ కూడా కలిసొచ్చినట్లు కనిపిస్తుంది. అదే ఇంగ్లీష్ టైటిల్స్. ఇప్పటి వరకు అతడు హీరోగా చేసిన సినిమాలన్నీ ఇంగ్లీష్ టైటిల్స్‌తో వచ్చినవే. ప్రదీప్ రంగనాథన్ నెక్ట్స్ ఫిల్మ్ లవ్ ఇన్సురెన్స్ కంపెనీ కూడా ఇంగ్లీష్ టైటిలే. దీపావళికి రిలీజ్ కావాల్సిన ఈ మూవీ పోస్ట్ పోన్ అయింది. దీనికి విఘ్నేశ్ శివన్ దర్శకుడు. ఎప్పుడో స్టార్టైన ఈ మూవీకి డిసెంబర్ 18న థియేటర్లలో సందడి చేయబోతోంది. మరి ఈ సినిమాతో వంద కోట్ల వసూళ్లు రాబడతాడేమో చూడాలి.