ప్రభాస్ నటించబోయే సినిమాలలో సందీప్ రెడ్డి వంగాతో చేయబోయే స్పిరిట్ కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు అభిమానులు. ఇప్పటికే దర్శకుడు సందీప్ రెడ్డి వంగ ప్రీ ప్రొడక్షన్ వర్క్‌తో బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం కొత్త నటీ నటులను ఫైనల్ చేసే పనిలో ఉన్నాడు. మరోవైపు ప్రభాస్ ఫౌజీ. రాజసాబ్ షూటింగ్స్ పూర్తి చేసేలా జెట్ స్పీడ్‌లో ఉన్నాడు. వీలైనంత త్వరగా స్పిరిట్‌ను సెట్స్ పైకి తీసుకెళ్లేలా ప్లాన్ చేస్తున్నాడు వంగా .ఈ సినిమాలో ఫస్ట్ టైం పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపించబోతున్నాడు ప్రభాస్.
కాగా నిన్న రెబల్ స్టార్ ప్రభాస్ బర్త్ డే కానుకగా స్పిరిట్ నుండి క్రేజీ అప్డేట్ రిలీజ్ చేసారు మేకర్స్. ఈ సినిమాలో రెబల్ స్టార్ పాత్ర ఎలా ఉండబోతుందో ఆడియో రూపంలో చిన్న పాటి గ్లిమ్స్ వీడియో రిలీజ్ చేసారు. రెబల్ స్టార్ వాయితో మిస్టర్ సూపరిండేంట్ చిన్నప్పటి నుండి నాకు ఒక చిన్న బ్యాడ్ హ్యబిట్ ఉంది ‘OneBadHabit’ అని చెప్పిన డైలాగ్ హైలెట్ గా నిలిచింది. అలాగే ఈ సినిమాలో హీరోయిన్ గా బాలీవుడ్ నటి త్రిప్తి డిమ్రి నటిస్తున్నట్టు ప్రకటించారు. అలాగే బాలీవుడ్ హీరో కమ్ విలన్ వివేక్ ఒబెరాయ్ ఈ సినిమాలో విలన్ గా నటిస్తున్నాడు. ప్రకాష్ రాజ్, అర్జున్ రెడ్డి ఫేమ్ కాంచన ఈ చిత్రంలో నటిస్తున్నారు. ప్రభాస్ బర్త్ డే కానుకగా రెబల్ స్టార్ అభిమానులకు సాలిడ్ ట్రీట్ ఇచ్చాడు సందీప్ రెడ్డి వంగా. భద్రకాళి పిచర్స్, టీ సిరీస్ కలిపి సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి