Site icon NTV Telugu

Palla Rajeshwar Reddy : ప్రైవేటు, గుజరాతి వ్యాపారులకు దేశాన్ని అమ్మే ప్రయత్నం చేస్తున్నారు

Palla Rajeshwar Reddy

Palla Rajeshwar Reddy

MLC Palla Rajeshwar Reddy Criticized Union Government

విద్యుత్ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా సోమజిగూడా ప్రెస్ క్లబ్ లో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. అయితే సమావేశంలో ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యుత్ సవరణ బిల్లును టిఆర్ఎస్ వ్యతిరేకిస్తోందన్నారు. అంతేకాకుండా.. ఈ బిల్లు మూలంగా మూడు నష్టాలు ఉంటాయి. రాష్ట్ర ప్రభుత్వాలకు, విద్యుత్ ఉద్యోగులకు, సామాన్య ప్రజలకు ఇబ్బందులు తప్పవు. 2014 సంవత్సరం నుంచి రాష్ట్రంలో 24 గంటల నాణ్యమైన ఉచిత రైతులకు అందిస్తున్నాము. 30 లక్షల మోటార్ పంపులకు నిరంతర విద్యుత్ ఉచితంగా ఇస్తున్నాం. లైన్స్ డెవలప్మెంట్ కోసం 36 వేల కోట్లు ఖర్చు చేశాం.

 

18 వేల కోట్లు డిస్ట్రిబ్యూషన్ కోసం, 18 వేల కోట్లు ట్రాన్స్ మిషన్ కోసం తెలంగాణ ప్రభుత్వం ఖర్చు చేసింది. సీఎస్, ముఖ్యమంత్రి, డిజిపి జీతాల కంటే కరెంటు ఏడీఈ జీతం ఎక్కువ ఇస్తున్నాం. బీఎస్ఎన్ఎల్ ఉద్యోగులు రోడ్డు మీద పడ్డట్లు విద్యుత్ సంస్థల ఉద్యోగులు ఇబ్బందులు పడుతారు. గుజరాత్ లో వ్యవసాయానికి ఆరు గంటల కరెంటు ఇవ్వలేక పోతున్నారు. 10 లక్షల కోట్ల రూపాయలు బ్యాంకుల నుంచి అప్పులు తీసుకున్న వారికి కేంద్ర ప్రభుత్వం మాఫీ చేసింది. ప్రైవేటు, గుజరాతి వ్యాపారులకు దేశాన్ని అమ్మే ప్రయత్నం చేస్తున్నారు అని ఆయన మండిపడ్డారు.

 

Exit mobile version