NTV Telugu Site icon

Palakurthi Thikkareddy: రా.. కదిలి రా కార్యక్రమం విజయవంతం చేయాలి..

Tikka Reddy

Tikka Reddy

Palakurthi Thikkareddy: కర్నూలు జిల్లా పత్తికొండ టీడీపీ కార్యాలయంలో మంత్రాలయం నియోజకవర్గ ఇంఛార్జ్ పాలకుర్తి తిక్కారెడ్డి కార్యకర్తలతో సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో టీడీపీ అధినేత చంద్రబాబు బహిరంగ సభను విజయవంతం చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఈ నెల 25న పత్తికొండలో రా..కదిలి రా కార్యక్రమం జరుగనుందని, ఈ కార్యక్రమాన్ని కార్యకర్తలు విజయవంతం చేయాలని తిక్కారెడ్డి కోరారు.

Read Also: Google: సెలబ్రిటీల లాగే మీ పేరు కూడా గూగుల్ సెర్చ్ లో కనిపించాలా? అయితే ఈ చిన్న పని చేయండి చాలు

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయక అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి జగన్ చేసిన అరాచకాలను తెలియజెప్పేందుకు ఈ కార్యక్రమం చేపట్టారని తిక్కారెడ్డి అన్నారు. కాగా.. రాష్ట్ర వ్యాప్తంగా జనవరి 5 నుంచి 29 వ‌ర‌కూ మొత్తం 25 పార్లమెంట్‎ నియోజకవర్గాల్లో బ‌హిరంగ స‌భ‌లు నిర్వహిస్తుంది టీడీపీ.

Read Also: Miss World Pageant: 28 ఏళ్ల తర్వాత “మిస్ వరల్డ్” పోటీలకు భారత్ ఆతిథ్యం..