బడుగు బలహీన వర్గాల కోసం పుట్టిన నాయకుడు, పేదల ఆశాజ్యోతి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అని మంత్రాలయం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ బాధ్యులు పాలకుర్తి తిక్కారెడ్డి అన్నారు. ఆయన ఇవాళమంత్రాలయం మండలం సుంకేశ్వరి గ్రామంలో నవ్యాంధ్ర ఎమ్మార్పీఎస్, ఎస్సీ సెల్ నాయకులు దేవదాస్ అధ్యక్షతన జరిగిన భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహం కు పూలమాలవేసి నివాళులు అర్పించారు. ఈ నేపథ్యంలో ఆయన మాట్లాడుతూ.. భారత రాజ్యాంగం రాసి ప్రపంచ దేశాలలోనే మన రాజ్యాంగాన్ని గొప్పతనాన్ని చాటి చెప్పిన మహానుభావుడు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అని కొనియాడారు.
బడుగు బలహీన వర్గాల కోసమే భారత రాజ్యాంగాన్ని రాసిన మహానేత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని పాలకుర్తి తిక్కారెడ్డి అన్నారు. ప్రతి ఒక్కరూ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ రాజ్యాంగ ప్రకారం నడుచుకోవాలని ఆయన అన్నారు. ఆయన ఆశయ సాధన ప్రకారం నడుచుకోవాలని బడుగు బలహీన వర్గాలు రాజకీయంగా ఆర్థికంగా ఎదగాలని పాలకుర్తి తిక్కారెడ్డి అన్నారు. అంబేద్కర్ విగ్రహం కు విగ్రహ ప్రతిష్ట కమిటీ సభ్యులకు 50 వేల రూపాయలు విరాళం అందజేశారు. ఈ కార్యక్రమంలో క్లస్టర్ ఇంచార్జ్ చావిడి వెంకటేష్, బీసీ సెల్ నియోజకవర్గ అధ్యక్షులు మాధవరం అమర్నాథ్ రెడ్డి, మాజీ సర్పంచ్ రోగప్ప, పిట్టర్, ఆంధ్రశ్, రాజన్న, జయరాజ్, ప్రకాష్, దేవపుత్ర, డేవిడ్, సుదర్శన్, ఆర్లప్ప, సామెల్, ఐటిడిపి చిదానంద తదితరులు పాల్గొన్నారు.
Bharat Jodo Nyay Yatra: భారత్ జోడో న్యాయ్ యాత్ర లోగోను విడుదల చేసిన ఖర్గే