NTV Telugu Site icon

Chinna Reddy: రాష్ట్రావతరణ వేడుకల్లో సోనియా గాంధీ ఫోటోకు పాలాభిషేకం

Chinna Reddy

Chinna Reddy

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాష్ట్రంలోని ప్రధాన పార్టీలన్నీ పలు కార్యక్రమాలు చేపడుతున్నాయి. ఇవాళ మాజీ మంత్రి చిన్నారెడ్డి హైదరాబాద్ లోని గాంధీ భవన్ లో మీడియా సమావేశం నిర్వహించారు. తమ పార్టీ చేపట్టనున్న కార్యక్రమాలను ఆయన వివరించారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకల నిర్వహణ కమిటీ ఛైర్మన్ గా చిన్నారెడ్డి ఉన్నారు. ఈ నెల 2వ తారీఖు ఒక ముఖ్యమైన రోజు.. దాదాపు 65 ఏళ్లు తెలంగాణ కోసం పోరాడాం అని ఆయన అన్నారు. జూన్ 2న తెలంగాణ ప్రజల ఆకాంక్ష తీరిన రోజు.. సోనియా గాంధీ లేకపొతే తెలంగాణ వచ్చేది కాదు అని సీఎం కేసీఆర్ స్వయానా అసెంబ్లీ వేదికగా చెప్పారు అని గుర్తు చేశారు. తెలంగాణ ప్రభుత్వం దశాబ్ది ఉత్సవాలను ఘనంగా చేస్తాం అని చెప్పుకుంటున్నారు.

Read Also: Kiran Kumar Reddy: కిరణ్‌కుమార్ రెడ్డి కీలక వ్యాఖ్యలు.. సందర్భం వచ్చాక స్పందిస్తా

అసలు ఈ తొమ్మిదేళ్లలో ఎటువంటి అభివృద్ధి జరిగింది? ఎటువంటి అభివృద్ధి జరగలేదు అని కాంగ్రెస్ పార్టీ చెబుతోంది అని చిన్నారెడ్డి అన్నారు. వచ్చే ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. జూన్ 2న ప్రతి జిల్లాలలోని పార్టీ కార్యాలయంలో జాతీయ పతాకం ఎగురవేయాలని చిన్నారెడ్డి పిలుపునిచ్చారు. సోనియా గాంధీ చిత్ర పటానికి పాలభిషేకం చేయాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించిందన్నారు. ఆయా జిల్లాలలో ర్యాలీ కార్యక్రమాలు బహిరంగ సభలు ఏర్పాటు చేయాలని మాజీ మంత్రి చిన్నారెడ్డి పేర్కొన్నారు.

Read Also: Khairatabad Ganesh: ఖైరాతాబాద్ గణపయ్య విగ్రహ పనులకు అంకురార్పణ

ప్రతి జిల్లాలో కూడా తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్న వారికి సన్మాన కార్యక్రమాలు ఉంటాయని మాజీ మంత్రి చిన్నారెడ్డి అన్నారు. 3, 4, 5 తేదీల కార్యక్రమాలు త్వరలో చెబుతామన్నారు. గన్ పార్క్ వద్ద అమర వీరుల స్థూపానికి మొదట నివాళులు అర్పించిన తర్వాత.. బాబూ జగజ్జీవన్ రావు విగ్రహానికి నివాళులర్పిస్తాం.. హైదరాబాద్ లో భారీ బహిరంగ సభ నిర్వహిస్తామని చిన్నారెడ్డి చెప్పుకొచ్చారు. ప్రతి ఒక్క కాంగ్రెస్ కార్యకర్త రాష్ట్రావతరణ వేడుకల్లో పాల్గొనాలని పిలుపునిచ్చారు.