శ్రీశైలం ఎడమగట్టు కాలువ టన్నెల్ లో చోటుచేసుకున్న ప్రమాదం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. టన్నెల్ పైకప్పు కూలిపోవడంతో ప్రమాదం సంభవించింది. టన్నెల్ పనులు జరుగుతున్న వేళ పైకప్పు కూలిపోవడంతో అందులో పనిచేస్తున్న 8 మంది కార్మికులు అందులో చిక్కుకుపోయారు. సంఘటన జరిగి రెండు రోజులు కావొస్తున్నా కార్మికుల జాడ తెలియకపోవడంతో ఆందోళన ఎక్కువైపోయింది. టన్నెల్ లో చిక్కుకున్న కార్మికులను బయటకు తీసుకొచ్చేందుకు ప్రభుత్వ యంత్రాంగం తీవ్రంగా శ్రమిస్తోంది.
Also Read:GV Reddy: ఏపీ ఫైబర్ నెట్ చైర్మన్ పదవికి రాజీనామా..
అయితే టన్నెల్ లో ఊట నీరు, బురద ఎక్కువగా ఉండడంతో రెస్క్యూ ఆపరేషన్ కు ఆటంకం కలుగుతోంది. ఘటనా స్థలికి రెస్క్యూటీమ్ చేరుకోలేకపోతోంది. ఈ క్రమంలో టన్నెల్ లో రెస్క్యూ ఆపరేషన్ నిలిచిపోయింది. నీరు, మట్టిదిబ్బలు, బోరింగ్ మెషిన్ శిథిలాలు తొలగిస్తేనే సహాయక చర్యలు ముందుకు సాగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. లేకపోతే రెస్క్యూ ఆపరేషన్ చేయలేమని ఎన్బీఆర్ఎఫ్ బృందం తేల్చి చెప్పింది. ఎస్ఎల్బీసీ టన్నెల్ లో పరిస్థితిని చూసి నేవీ టీమ్ కూడా వెనుదిరిగింది.
Also Read:Health Benefits of Dates: ప్రతిరోజూ ఖర్జూరాలు తింటే.. ఈ వ్యాధులు రమ్మన్నా రావు!
టన్నెల్ లోని మట్టి తొలగించేందుకు అధికారులు మినీ జేసీబీని పంపించారు. అయితే తోడిన మట్టి సహాయక చర్యలకు ఆటంకంగా మారనుండడంతో జేసీబీని వెనక్కి రప్పించారు. ర్యాట్ మైనర్లను లోపలికి అనుమతించడం లేదు. రాత్రికి నీటి తీవ్రత పెరిగితే.. రేపు10 కి.మీల వరకు కూడా వెళ్లడం కష్టమే అంటున్నారు అధికారులు. ఇప్పటికీ కార్మికుల జాడ తెలియకపోవడంతో వారి కుటుంబాల్లో ఆందోళన నెలకొన్నది.