మహారాష్ట్ర షాహునగరి కొల్హాపూర్‌కు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు ఉంది. కొల్హాపూర్ కుస్తీ, బెల్లం, ఆహార సంస్కృతి, కొల్హాపురి చెప్పులు కూడా ప్రపంచ ప్రసిద్ధి చెందాయి. రాజకీయ నాయకుల నుంచి బాలీవుడ్ తారల వరకు అందరూ కొల్హాపురి చెప్పులు వేసుకోవడానికి తహతహలాడుతున్నారు. ఇప్పుడు ఈ కొల్హాపురి చప్పల్ పాకిస్థాన్‌లోనూ క్రేజ్‌గా మారింది. ఆన్‌లైన్ మాధ్యమాల ద్వారా పాకిస్థాన్ నుంచి డిమాండ్ భారీగా పెరిగింది. ఇక్కడి వ్యాపారులు పెద్ద మొత్తంలో చెప్పులను పాకిస్థాన్‌కు ఎగుమతి చేస్తున్నారు.
READ MORE: Harish Rao : గ్రామ సభల్లో విడుదల చేస్తున్న అర్హుల జాబితాకు ఉన్న విలువ ఏంది?
కొల్హాపూర్‌లో లెదర్ స్లిప్పర్స్ పరిశ్రమ చాలా పాతది. ఇక్కడి కళాకారులు తయారు చేసే తోలు చెప్పులను కొల్హాపురి చెప్పులు అంటారు. ఈ పరిశ్రమను అప్పటి రాజర్షి షాహూ మహారాజ్ చాలా ప్రోత్సాహాన్ని అందించారు. దీంతో కొల్లాపూర్‌కు చెందిన ఈ వ్యాపారానికి మార్కెట్ పెరుగుతూ.. వచ్చింది. అమెరికా, సింగపూర్, కెనడా వంటి దేశాలకు కూడా కొల్హాపురి చెప్పులు ఎగుమతి అవుతున్నాయని చెప్పుల వ్యాపారి రోహిత్ కాంబ్లే తెలిపారు.
READ MORE: Maharastra : ఆర్మీ ఆయుధ కర్మాగారంలో పేలుడు.. ఎనిమిదికి చేరిన మృతుల సంఖ్య..ఘటనకు కారణం ఏంటంటే ?
కొల్హాపురి చెప్పులు పాకిస్థాన్‌లో ప్రసిద్ధి చెందాయి?
పాకిస్థాన్‌లో కొల్హాపురి చెప్పులు బాగా ప్రాచుర్యం పొందాయి. కొన్నిసార్లు పాకిస్థాన్ నుంచి రెజ్లర్లు కొల్హాపూర్ కు రెజ్లింగ్ ప్రాక్టీస్ చేయడానికి వచ్చేవారు. వారు కొల్హాపురి చెప్పులకు ఆకర్శితులయ్యేవారు. పాక్‌లో వేడి, తేమతో కూడిన వాతావరణం ఉంటుంది. దీని కారణంగా, ప్రజలు కొల్హాపురి చెప్పులను ఇష్టపడుతున్నారు. ఎందుకంటే ఈ చెప్పులు ఆ వాతావరణాన్ని తట్టుకుంటాయట. సంప్రదాయ పద్ధతిలో తయారయ్యే ఈ చెప్పులు.. మంచి డిజైన్‌తో కనిపిస్తాయి. ఈ చెప్పుల తయారీ సమయంలో నూనెను ఉపయోగిస్తారు. దీని కారణంగా వాటిని ధరించినప్పుడు చల్లగా, మృదువుగా అనిపిస్తుంది. అందుకే వీటి కోసం ఎగబడతారు.