UP: పాకిస్థాన్ మహిళకు భారత్‌లో ప్రభుత్వ ఉద్యోగం లభించింది.. పాకిస్థాన్ పౌరసత్వాన్ని దాచిపెట్టి విద్యాశాఖలో ఉద్యోగం పొందిన మహిళపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటనకు సంబంధించిన ఎఫ్‌ఐఆర్‌ను ఉత్తర్‌ప్రదేశ్‌లోని అజీమ్‌నగర్ పోలీస్ స్టేషన్‌లో నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు. విద్యాశాఖ చేపట్టిన అంతర్గత విచారణలో మహిరా అక్తర్ అనే మహిళ, ఫర్జానా అనే పేరుతో నకిలీ పత్రాలు ఉపయోగించి ఉద్యోగం పొందినట్లు తేలింది. ఆమె కుమహరియా గ్రామంలోని ఒక ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పని చేసినట్లు పోలీసులు వెల్లడించారు.
READ MORE: OPPO Reno 15 Price: 200MP కెమెరా, 6,500mAh బ్యాటరీ.. మతిపోయే ఫీచర్లతో ఒప్పో రెనో 15 లాంచ్!
అదనపు ఎస్పీ అనురాగ్ సింగ్ తెలిపిన వివరాల ప్రకారం.. నిందితురాలు పాకిస్థాన్ పౌరురాలైనప్పటికీ తప్పుడు నివాస ధ్రువపత్రం చూపించి భారత పౌరురాలిగా నటిస్తూ ఉద్యోగం సాధించింది. ఈ నేపథ్యంలో మోసం, ఫోర్జరీ కేసుల కింద భారతీయ న్యాయ సంహిత ప్రకారం ఆమెపై కేసు నమోదు చేశారు. పోలీసుల వివరాల ప్రకారం, ఆమె 1979లో ఒక పాకిస్థాన్ వ్యక్తిని వివాహం చేసుకుని పాకిస్థాన్ పౌరసత్వం పొందింది. ఆ తర్వాత విడాకులు తీసుకుని, పాకిస్థాన్ పాస్‌పోర్టుతో భారత్‌కు వచ్చి 1985 ప్రాంతంలో స్థానిక వ్యక్తిని పెళ్లి చేసుకుంది. అదే సమయంలో తాను భారత పౌరురాలినని చూపిస్తూ విద్యాశాఖలో ఉద్యోగంలో చేరింది. ఆమె అసలు పౌరసత్వం బయటపడటంతో విద్యాశాఖ ముందుగా సస్పెండ్ చేసి, అనంతరం ఉద్యోగం నుంచి తొలగించింది. శాఖ నివేదిక ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ప్రస్తుతం విచారణ కొనసాగుతోందని, ఇప్పటివరకు ఎవరినీ అరెస్ట్ చేయలేదని అధికారులు తెలిపారు.
READ MORE: Amit Shah: జమ్మూకశ్మీర్‌పై అమిత్ షా అధ్యక్షతన భద్రతా సమావేశం.. నెక్ట్స్ టార్గెట్ ఇదే!