Site icon NTV Telugu

Father Abuse on Daughters: తండ్రి కాదు కామ పిశాచి.. ఐదుగురు కూతుర్లపై అత్యాచారం.. వీడియో వైరల్..!

Father Abuse On Daughters

Father Abuse On Daughters

Father Abuse on Daughters: ఈ మధ్య ఎక్కడ చూసిన ఎన్నో అఘాయిత్యాలకు సంబంధించిన విషయాలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. ముఖ్యంగా భార్యలు భర్తలపై చేసే కుట్రలు, ఇంకా మహిళలపై జరిగే దారుణాలు ఎక్కువయ్యాయి. ఇకపోతే ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ హృదయవిదారక వీడియో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో పాకిస్తాన్‌కు చెందిన ఓ ముస్లిం మహిళ కన్నీటి మధ్య తనపై జరిగిన అసహ్యకరమైన అనుభవాన్ని పంచుకుంది. ఆమె చెప్పిన వివరాలు వింటే మాత్రం ఎవరినైనా ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురిచేసేలా ఉన్నాయి.

Read Also:Hidma: హిడ్మాను చుట్టుముట్టిన భద్రత బలగాలు.. లొంగిపోతారా..? లేక చచ్చిపోతారా…?

ఈ బాధితురాలికి మొత్తం నలుగురు సోదరీమణులు ఉన్నారు. అంటే ఆమెతో కలిపి ఐదుగురు. ఇక ఆమె వైరల్ గా మారిన వీడియోలో ఆవేదనగా చెబుతున్న వివరాల ప్రకారం.. గత 15 సంవత్సరాల పైగా వారి తండ్రి తమపై శారీరకంగా దాడి చేస్తున్నాడని వివరించింది. తనను మొదటిసారి 12 ఏళ్ల చిన్నారిగా ఉన్నపుడే వేధించాడని అని ఆమె వాపోయింది. అంతే కాదండోయ్.. విషయం ఇక్కడితో ఆగలేదు. ఆమె తెలిపిన వివరాల ప్రకారం, ఆమె తండ్రి తన మిగితా సోదరీమణులపై కూడా క్రూరంగా అత్యాచారం చేశాడని వెల్లడించిందది. ఈ దారుణమైన సంబంధాల వల్ల ప్రతి ఒక్క సోదరి ఒక బిడ్డ జన్మించారని తెలిపింది. అంతేకాదు.. ప్రస్తుతం మళ్లీ వారందరూ గర్భవతులు అయ్యారు అని ఆమె వెల్లడించింది.

Read Also:CM Revanth Delhi Tour: ఢిల్లీ పర్యటనలో సీఎం రేవంత్.. కేంద్ర మంత్రులతో కీలక చర్చలు..!

తమ ఇంట్లో తాము ఎలాంటి భద్రతా లేని పరిస్థితుల్లో జీవిస్తున్నామనీ, తమకు ఎక్కడా ఆశ్రయం లేదనీ బాధితురాలు కన్నీటితో చెబుతోంది. ఆమె చెప్పిన ఈ విషయాలు అక్కడి సమాజంలో మహిళల పరిస్థితిపై తీవ్ర చర్చను రేకెత్తిస్తున్నాయి. ఈ వీడియో ఎప్పుడు తిసిందో స్పష్టంగా తెలియకపోయినా.. ఇందులో ఉన్న విషయాలు చాలా మందిని కదిలించాయి. ఇలాంటి ఘటనలు నమ్మశక్యంగా లేకపోయినా, వాస్తవంగా జరుగుతున్నాయని తెలిసినప్పుడు ఆలోచన చేయాలిసిన పరిస్థితి నెలకొంది.

Exit mobile version