ఈనెల 14న ఇండియా-పాకిస్తాన్ తలపడిన విషయం తెలిసిందే. ఆ మ్యాచ్లో పాక్ పై భారత్ ఘన విజయం సాధించింది. అయితే వరల్డ్ కప్లో ఇండియా పాకిస్తాన్ పై వరుసగా 8వ విజయాన్ని నమోదు చేసింది. అయితే ఆ ఓటమిని దిగమింగుకోలేకపోయిన పాకిస్తానీలు ఇండియాపై ఏదో విధంగా విమర్శలు చేస్తున్నారు. ఇక పాకిస్తాన్ నటి షెహర్ షిన్వారీ అయితే ఏకంగా పలు రకాల బంపర్ ఆఫర్లు ఇస్తున్నారు.
Allu Arjun: ఇద్దరు పోరంబోకులకు నేషనల్ అవార్డు వచ్చింది..
ఆ తర్వాత ఇండియా-బంగ్లాదేశ్తో జరిగిన మ్యాచ్ లో బంగ్లా ఆటగాళ్లకు ఓ బంపర్ ఆఫర్ ప్రకటించింది ఈ పాకిస్తానీ అమ్మడు. భారత్ ను ఓడిస్తే వారిలో ఓ క్రికెటర్తో డేటింగ్ చేస్తానని తెలిపింది. కానీ బంగ్లా భారత్ను ఓడించలేకపోయింది. ఇప్పుడు ఆఫర్ అలానే బ్యాలెన్స్ ఉంది. తాజాగా.. మరోసారి న్యూజిలాండ్ ఆటగాళ్లకు ఆఫర్ని మళ్లీ అప్లై చేసింది. ఈసారి న్యూజిలాండ్ బౌలర్ జిమ్మీని ఉద్దేశించి ట్వీట్ చేసింది. ‘‘హే జిమ్మీ నీష్ (జేమ్స్ నీషామ్) నీవు భారత జట్టును ఓడిస్తే గనుక, మేము పాకిస్థానీలం నిన్ను తదుపరి ప్రధానిగా ఎన్నుకుంటాం’’అంటూ ఓ కామెడీ ట్వీట్ చేసింది. అయితే ఇవాళ్టి మ్యాచ్ లో జేమ్స్ నీషామ్ ఆడటం లేదు. అయినా షెహర్ కు ఇలాంటి పరాభవాలు కొత్తేమీ కాదు. అందుకే ఈ నటిని నెటిజన్లు తెగ ట్రోల్ చేస్తున్నారు.
IND vs NZ: న్యూజిలాండ్తో మ్యాచ్.. రవిశాస్త్రి కీలక వ్యాఖ్యలు
అయితే ఎంతకు ఈ అమ్మడికి భారత్ పై కసి చల్లారడం లేదు. ఎట్టకేలకు ఇండియా ఓటమిని చూడాలని పరితపిస్తోంది. ఇప్పటికీ ఈ విషయంలో ఎన్నో సార్లు బెడిసికొట్టినా.. భారత్ జట్టు అదే పనిగా భారత్ ఓటమి కోసం ప్రార్థించడమే ఏకైక పనిగా పెట్టుకున్నట్టుంది. తాజాగా భారత్ జట్టుని ఓడించాలంటూ న్యూజిలాండ్ జట్టుకు భలే ఆఫర్ ఇచ్చింది. చూడాలి మరీ ఈ మ్యాచ్ లోనైనా న్యూజిలాండ్ భారత్ ను ఓడించి ఈమే కోరికను నెరవేరుస్తారో…