NTV Telugu Site icon

Naseem Shah: నా టార్గెట్ విరాట్ కోహ్లీ.. పాక్ యువ బౌలర్ హాట్ కామెంట్స్..

Naseemsha

Naseemsha

పాకిస్థాన్ యంగ్ పేసర్ నసీమ్ షా తన మూడేళ్ల అంతర్జాతీయ కెరీర్ లోనే సంచలనం సృష్టించాడు. 2019లో టెస్టు క్రికెట్ లో అంతర్జాతీయ కెరీర్ ను నసీమ్ షా ప్రారంభించారు. ఇప్పుడు మూడు ఫార్మాట్లలో పాక్ జట్టులో శాశ్వత సభ్యుడిగా అయ్యాడు. దాదాపు గంటకు 140 కిలోమీటర్ల వేగంతో బౌలింగ్ చేయగల నసీమ్.. తన మెయిన్ టార్గెట్ కింగ్ విరాట్ కోహ్లీ అంటూ ప్రకటించాడు. ఓ ఇంటర్వ్యూలో నసీమ్ షా మాట్లాడుతూ.. విరాట్ కోహ్లీని సున్నాకి ( డకౌట్) అవుట్ చేయడమే నా బిగ్ డ్రీమ్ అంటూ అతను చెప్పుకొచ్చాడు.

Also Read : Pakistan: పేదరికాన్ని నివారించడానికి పాకిస్తాన్ వ్యూహాలు.. ఇలా కూడా చేస్తారా?

భారత్‌తో ఆడేటప్పుడు నా ప్రాణాలను పణంగా పెడతానని.. ఈసారి విరాట్ కోహ్లీ వికెట్ పడగొట్టడమే మా అందరి లక్ష్యం అంటూ ప్రకటించాడు. ముఖ్యంగా సున్నాకి ఔట్ చేయాలన్నది నా కల అంటూ చెప్పుకొచ్చాడు. విరాట్ కోహ్లీని డకౌట్ అవుట్ చేయడం అంటే.. ఎంతో గర్వించదగ్గ విషయం. అందువల్ల రాబోయే రోజుల్లో కింగ్ కోహ్లీని డకౌట్ చేస్తానని నసీమ్ షా వెల్లడించాడు.

Also Read : Sri Sai Chalisa: శ్రీ సాయి చాలీసా వింటే మనోభీష్టాలను సిద్ధిస్తాయి

వచ్చే ఆసియా కప్‌లో భారత్, పాకిస్థాన్ జట్లు తలపడనున్నాయి. దీంతో పాటు టీమిండియా వేదికగా జరుగనున్న వన్డే ప్రపంచకప్‌లోనూ దాయాది పోరు ఉండనుంది. కాబట్టి నసీస్ షా కలను విరాట్ కోహ్లీ ఎలా ఛేదిస్తాడో అనేది వేచి చూడాలి. పాకిస్థాన్ తరపున 15 టెస్టు మ్యాచ్ లు ఆడిన నసీమ్ షా మొత్తం 42 వికెట్లు తీసుకున్నాడు. అలాగే 8 వన్డేల్లో 23 వికెట్లు తీసుకోగా.. 19 టీ20ల్లో 15 వికెట్లు పడగొట్టాడు. రాబోయే ఆసియా కప్, వరల్డ్ కప్.. ఈ రెండు పెద్ద టోర్నీల్లో తన పెద్ద కలతో టీమ్ ఇండియాతో పోటీ పడాలని కోరుకుంటున్నాడు.