NTV Telugu Site icon

Saudi Arabia: పాకిస్థాన్ యాచకుల వల్ల హజ్ యాత్రికులపై ప్రతికూల ప్రభావం?

Pakistan

Pakistan

ఉమ్రా, హజ్ పేరుతో తమ దేశానికి వస్తున్న పాకిస్థానీ యాచకుల సంఖ్య పెరుగుతుండడం పట్ల సౌదీ అరేబియా ఆందోళన వ్యక్తం చేసింది. యాచకులను గల్ఫ్ దేశంలోకి ప్రవేశించకుండా చర్యలు తీసుకోవాలని పాకిస్థాన్‌కి సూచించింది. ఈ మేరకు మంగళవారం ఓ మీడియా వార్తా కథనంలో పేర్కొంది. పాక్ మత వ్యవహారాల మంత్రిత్వ శాఖ నుంచి వచ్చిన సమాచారాన్ని ఉటంకిస్తూ.. ‘ఎక్స్‌ప్రెస్ ట్రిబ్యూన్’ వార్తాపత్రిక తన వార్తలలో వాటిని నియంత్రించకపోతే, అది పాకిస్థాన్ ఉమ్రా, హజ్ యాత్రికులపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుందని హెచ్చరించింది.

READ MORE: Elon Musk: భారతీయ-అమెరికన్ బిలియనీర్‌కు ఎలాన్ మస్క్ క్షమాపణ.. అసలేం జరిగిందంటే..!

‘ఎక్స్‌ప్రెస్ ట్రిబ్యూన్’ కథనం ప్రకారం.. ఉమ్రా వీసా కింద గల్ఫ్ దేశంలోకి పాకిస్థానీ బిచ్చగాళ్లు ప్రవేశించకుండా చర్యలు తీసుకోవాలని కోరుతూ సౌదీ హజ్ మంత్రిత్వ శాఖ పాకిస్థాన్ మత వ్యవహారాల మంత్రిత్వ శాఖకు హెచ్చరిక జారీ చేసింది. ఈ హెచ్చరికను అనుసరించి, పాక్ మత వ్యవహారాల మంత్రిత్వ శాఖ ‘ఉమ్రా చట్టం’ తీసుకురావాలని నిర్ణయించింది. ఇది ఉమ్రా ఏర్పాట్లు చేసే ట్రావెల్ ఏజెన్సీలను నియంత్రించడం, వాటిని చట్టపరమైన పర్యవేక్షణలోకి తీసుకురావడం లక్ష్యంగా పెట్టుకుంది. అంతకుముందు.. సౌదీ రాయబారి నవాఫ్ బిన్ సయీద్ అహ్మద్ అల్-మాలికీతో సమావేశమైన అంతర్గత మంత్రి మొహ్సిన్ నఖ్వీ సౌదీ అరేబియాకు యాచకులను పంపే మాఫియాపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఉమ్రా ముసుగులో పాకిస్థానీ బిచ్చగాళ్లు గల్ఫ్ దేశానికి వెళుతున్నారు. చాలా మంది ఉమ్రా వీసాపై సౌదీ అరేబియాకు వెళ్లి, ఆపై భిక్షాటనకు సంబంధించిన కార్యకలాపాలలో పాల్గొంటారు.

READ MORE:Paris Fashion Week: పారిస్ ఫ్యాషన్ వీక్ లో 86 ఏళ్ల నటి ర్యాంప్‌ వాక్..