Pakistan PM: ‘152/0 వర్సెస్ 170/0’.. భారత్ సెమీస్ ఓటమిపై పాకిస్థాన్ ప్రధాని వ్యంగ్యం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pakistan PM: టీ20 వరల్డ్ కప్‌లో మొదటి నుంచి అద్భుతంగా రాణించిన టీమిండియా సెమీస్‌లో ఉసూరుమనిపించింది. టీమిండియా సెమీస్‌లోనే వెనుదిరగడంతో క్రీడాభిమానులు నిరాశను వ్యక్తపరస్తున్నారు. మంచి ఊపుమీదున్న టీమిండియా.. ఇంగ్లండ్‌పై విజయం సాధించి ఫైనల్‌లో పాకిస్థాన్‌తో తలపడుతుందని భావిస్తే కథ అడ్డం తిరిగింది. ఒక్క వికెట్ తీయలేక భారత జట్టు చతికిలపడింది. ఇదిలా ఉండగా.. ఈ మ్యాచ్‌పై చాలా మంది ట్వీట్లు చేస్తు్న్నారు. ఈ టోర్నీలో భారత్ ఓటమిపై పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ వ్యంగ్యంగా స్పందించారు. “అదన్నమాట సంగతి… అయితే ఈ ఆదివారం 152/0 వర్సెస్ 170/0” అంటూ ట్వీట్ చేశారు.
Patanjali: ఉత్తరాఖండ్‌లో 5 పతంజలి మందులపై నిషేధం.. ఎందుకో తెలుసా?
Also Read
170/0 అనేది ఇంగ్లండ్ ఓపెనర్లు భారత జట్టుపై సాధించిన స్కోరు కాగా.. 152/0 అనేది గతేడాది వరల్డ్ టోర్నీలో టీమిండియాపై పాక్ జట్టు సాధించిన స్కోరు. గతేడాది టీమిండియాను పాకిస్థాన్ ఓడిస్తే.. ఇప్పడు మళ్లీ అదే రీతిలో ఇంగ్లండ్ ఓడించిందని పాకిస్థాన్ ప్రధాని తన ట్వీట్ ద్వారా వ్యంగ్యంగా ఎత్తిపొడిచారు. పాకిస్థాన్, ఇంగ్లండ్ జట్లు ఫైనల్‌కు చేరుకున్న సంగతి తెలిసిందే. ఈ నెల 13వ తేదీన ఆదివారం నాడు మెల్‌బోర్న్ వేదికగా ఫైనల్ సమరం జరగనుంది.
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!