Site icon NTV Telugu

World Cup 2023: వరల్డ్ కప్ నుంచి పాకిస్తాన్ ఔట్..?

Pakisthan

Pakisthan

వరల్డ్ కప్ 2023లో పాకిస్తాన్ ప్రయాణం దాదాపు ముగిసినట్లే. ఈరోజు జరిగిన మ్యాచ్ లో న్యూజిలాండ్ పై శ్రీలంక గెలిస్తే పాక్ కి సెమీస్ ఆశలుండేవి. కానీ, లంకను న్యూజిలాండ్ 5 వికెట్ల తేడాతో ఓడించింది. దీంతో పాకిస్తాన్ జట్టు సెమీస్ రేసు నుంచి దాదాపు నిష్క్రమించినట్లయింది. అయితే ఇప్పటికీ పాకిస్తాన్ కు సెమీస్ ఛాన్స్ ఉంది. కానీ, ఆ జట్టు ఇంగ్లండ్ ను 275 రన్స్ తేడాతో ఓడించడం లేదా ఆ జట్టుపై ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించడం చేయాలి. ఈ రెండూ అంత ఈజీ కాదు.

Read Also: Telangana Assembly Elections 2023: బీజేపీకి జనసేన ప్లస్సా..? బీజేపీనే జనసేనకు ప్లస్సా..?

పాకిస్తాన్ ఆడిన 8 మ్యాచ్ ల్లో 4 గెలిచింది. ఆ జట్టు నెట్ రన్ రేట్ +0.036 ఉంది. ఇక న్యూజిలాండ్ 9 మ్యాచ్ లు ఆడి ఐదింటిలో గెలిచింది. దాని రన్ రేట్ +0.743 ఉంది. దీంతో న్యూజిలాండ్ సెమీస్ కు వెళ్లే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఇక ఇప్పటికే ఇండియా టాప్ ప్లే్స్ లో కొనసాగుతుండగా.. సెకండ్ ప్లేస్ లో సౌతాఫ్రికా, థర్డ్ ప్లేస్ లో ఆస్ట్రేలియా ఉంది. ఇప్పుడు నాలుగో స్థానానికి న్యూజిలాండ్ చేరుకుంది. ఇదిలా ఉంటే.. భారత్, చివర్లో ఉన్న టీమ్ తో సెమీస్ లో తలపడనుంది. ఆ టీమ్ తో భారత్ గెలిస్తే డైరెక్ట్ గా ఫైనల్ కు చేరుకుంటుంది. ఇక ఓడిన టీమ్ ఇంటికి పోవాల్సిందే.

Read Also: The Trail: థియేటర్ లోకి మరో ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ వస్తుందిరోయ్..

Exit mobile version