NTV Telugu Site icon

Pakistan : అప్పుల ఊబిలో పాక్.. 60ఏళ్ల వయసులో ఐదోపెళ్లి చేసుకున్న కొత్త ప్రధాని

New Project (96)

New Project (96)

Pakistan : సుదీర్ఘ రాజకీయ సంక్షోభం తర్వాత ఎట్టకేలకు పాకిస్థాన్ ప్రధానిగా షెహబాజ్ షరీఫ్‌ 24వ ప్రధాని అయ్యారు. పీటీఐ, సున్నీ ఇత్తెహాద్ కౌన్సిల్ ప్రతిపక్ష అభ్యర్థి ఒమర్ అయూబ్ ఖాన్‌ను ఓడించి షెహబాజ్ షరీఫ్ పాకిస్తాన్ కొత్త ప్రధానమంత్రిగా ఎన్నికయ్యారు. ఎన్నికల తర్వాత, నవాజ్ షరీఫ్, బిలావల్ భుట్టో జర్దారీ నేతృత్వంలోని సంకీర్ణం షెహబాజ్ షరీఫ్‌ను ప్రధానమంత్రి పదవికి ప్రతిపాదించింది. షెహబాజ్ షరీఫ్‌ పంజాబ్ ప్రావిన్స్ నుండి తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించాడు, షెహబాజ్ షరీఫ్‌ మూడుసార్లు పంజాబ్ ముఖ్యమంత్రిగా పనిచేశారు.

రాజకీయ నాయకుడిగానే కాకుండా షెహబాజ్ షరీఫ్‌ పాకిస్తాన్ దేశానికి చెందిన అతిపెద్ద వ్యాపారవేత్తలలో ఒకరు. అతడు ఆసియాలోని పెద్ద ధనవంతులలో ఒకరు. షెహబాజ్ షరీఫ్‌ ఎల్లప్పుడూ పాకిస్తాన్ సైన్యంతో మంచి సంబంధాలను కలిగి ఉన్నాడు. అతడు తన వ్యక్తిగత జీవితం కారణంగా కూడా చాలాసార్లు వార్తల్లో నిలిచాడు. ఆయన ఇప్పటి వరకు ఐదు పెళ్లిళ్లు చేసుకున్నాడు. అందులో అతను ముగ్గురు భార్యలతో విడాకులు తీసుకున్నాడు. మరో ఇద్దరు ప్రస్తుతం అతడితో కలిసి జీవిస్తున్నారు.

షాబాజ్ షరీఫ్ వద్ద ఉన్న సంపద ఎంత?
షెహబాజ్ షరీఫ్‌కు పాకిస్థాన్‌లో కంటే విదేశాల్లోనే ఎక్కువ ఆస్తులున్నాయి. 2015లో పాకిస్తాన్ ఎన్నికల కమిషన్‌కు దాఖలు చేసిన ఆస్తుల ప్రకారం.. లండన్‌లోని అతని ఆస్తుల విలువ సుమారు రూ. 153 మిలియన్లు. పాకిస్తాన్‌లో రూ. 108.24 మిలియన్లు. షరీఫ్ మొత్తం సంపదను పరిశీలిస్తే అది రూ.262.29 మిలియన్లు. ఇది కాకుండా, షరీఫ్‌కు దాదాపు రూ. 130.22 మిలియన్ల అప్పులు ఉన్నాయి, వీటిని తొలగించిన తర్వాత షెహబాజ్ షరీఫ్‌ నికర విలువ రూ. 132.6 మిలియన్లు. పాకిస్తాన్ పేదరికంతో బాధపడుతుండవచ్చు కానీ అతను పాకిస్తాన్ ప్రధాని మాత్రం ప్రపంచంలోని అత్యంత ధనిక రాజకీయ నాయకులలో ఒకడు.

Read Also:Shraddha Kapoor : శ్రద్దా కపూర్ బాయ్ ఫ్రెండ్ ఇతనేనా?.. వైరల్ అవుతున్న ఫోటో..

షెహబాజ్ షరీఫ్‌ తన 23 సంవత్సరాల వయస్సులో 1973లో తన కుటుంబ సభ్యుల అనుమతి లేకుండా తన మొదటి వివాహం చేసుకున్నాడు. ఆయన మొదటి వివాహం నుస్రత్ షెహబాజ్ తో జరిగింది. అతనికి నలుగురు పిల్లలు ఉన్నారు. నుస్రత్ షాబాజ్ మరణం తరువాత, 43 సంవత్సరాల వయస్సులో 1993లో పాకిస్థాన్ మోడల్ అలియా హనీని వివాహం చేసుకున్నాడు. వారి రెండవ వివాహం ఎక్కువ కాలం కొనసాగలేదు. ఇద్దరూ ఒకరికొకరు విడాకులు తీసుకున్నారు. విడాకులు తీసుకున్న కొద్ది రోజులకే అలియా అనుమానాస్పద పరిస్థితుల్లో మరణించింది. ఆ తర్వాత షెహబాజ్ షరీఫ్‌ 1993లో నీలోఫర్ ఖోసాను వివాహం చేసుకున్నాడు. ఈ వివాహం కూడా ఎక్కువ కాలం కొనసాగలేదు.

రెండు వివాహాలు విఫలమైన తరువాత.. షాబాజ్ కొన్ని సంవత్సరాలు ఒంటరిగా ఉన్నాడు. 2003 లో అతను నాల్గవ సారి వివాహం చేసుకున్నాడు. ఈసారి షెహబాజ్ షరీఫ్‌ పాకిస్థానీ రచయిత్రి, కార్యకర్త, సామాజికవేత్త , కళాకారిణి అయిన తెహ్మినా దురానీని వివాహం చేసుకున్నారు. వారిద్దరూ ఎనిమిదేళ్ల పాటు రహస్యంగా ప్రేమించుకుని పెళ్లి చేసుకున్నారు. 2012లో ఆయనకు 60 సంవత్సరాల వయస్సులో మరోసారి ఐదవ సారి వివాహం చేసుకున్నాడు. ఈసారి అతను కుల్సూమ్ హాయి అనే అమ్మాయిని వివాహం చేసుకున్నాడు. ఈ వివాహం చాలా రహస్యంగా జరిగింది. వారిద్దరూ ఇప్పుడు విడాకులు తీసుకున్నారని సమాచారం.

Read Also:Minister Gummanuru Jayaram: నేడు వైసీపీకి రాజీనామా..! రేపు టీడీపీకి గూటికి మంత్రి జయరాం..