బాలీవుడ్ ముద్దుగుమ్మ శ్రద్దా కపూర్ వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది.. మరోవైపు వరుస యాడ్స్ లలో కనిపిస్తుంది.. తెలుగులో ప్రభాస్ సరసన సాహో సినిమా చేసింది.. ఆ సినిమా అనుకున్న హిట్ ను అందుకోలేక పోయిన కూడా ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగింది.. ప్రస్తుతం బాలీవుడ్ లో బిజీగా ఉన్న ఈ భామ తాజాగా అనంత్ – రాధికా ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ లో పాల్గొంది.. అయితే గత కొన్నాళ్లుగా శ్రద్ధా కపూర్ బాలీవుడ్ రచయిత రాహుల్ మోడీతో ప్రేమలో ఉందని, డేటింగ్ చేస్తుందని వార్తలు వస్తున్నాయి. కానీ వీరిద్దరూ కలిసి బయట ఎప్పుడూ కనిపించలేదు.. తాజాగా వీరిద్దరి వీడియో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది..
అంబానీ ఇంట జరిగిన పెళ్లి వేడుకలకు కలిసి హాజరయ్యారు. గుజరాత్ జామ్ నగర్ లో జరిగిన అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ ప్రీ వెడ్డింగ్ వేడుకలకి శ్రద్ధా కపూర్, తన బాయ్ ఫ్రెండ్ రాహుల్ మోడీతో కలిసి వచ్చింది.. దీంతో ఈ ఫోటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.. శ్రద్ధా కపూర్ బాయ్ ఫ్రెండ్ ఇతనే, ఇతనితోనే శ్రద్ధా డేటింగ్ చేస్తుంది అంటూ బాలీవుడ్ లో వార్తలు వస్తున్నాయి. మరి ఈ వార్తల పై వీరిద్దరూ క్లారిటీ ఇవ్వాల్సి ఉంది..
గత కొన్ని రోజులుగా ఈ వార్తలు ఎక్కువగా వినిపిస్తున్నాయి.. మొదటిసారి ఇలా ఇద్దరు కనిపించడంతో నిజమే అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.. ఇక శ్రద్దా కపూర్ ప్రస్తుతం బాలివుడ్ లో వరుస సినిమాలు చేస్తుంది.. రెండు ప్రాజెక్ట్ లు లైన్ లో ఉన్నాయని తెలుస్తుంది.. అలాగే తెలుగులో మరో మూవీ కోసం కథలు వింటుందని సమాచారం..