Gujarat: పాకిస్థాన్‌కు చెందిన 319 మందికి భారత పౌరసత్వం.. శరణార్థుల కన్నీటి పర్యంతం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Gujarat: పాకిస్థాన్ నుంచి వలస వచ్చి గుజరాత్లో తలదాచుకున్న 319 మందికి ఎట్టకేలకు భారతీయ పౌరసత్వం లభించింది. ఏళ్ల తరబడి పడిన నిరీక్షణ ఫలించడంతో ఆ కుటుంబాలన్నీ తమ జీవితంలో కొత్త అధ్యాయం మొదలైందని ఆనందం వ్యక్తం చేస్తున్నాయి. గుజరాత్‌లోని రాజ్‌కోట్‌లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆ రాష్ట్ర డిప్యూటీ సీఎం హర్ష్ సంఘ్వీ లబ్ధిదారులకు పౌరసత్వ ధ్రువపత్రాలను అందజేశారు. రాజ్‌కోట్‌లోని ప్రముఖ స్వామి ఆడిటోరియంలో జరిగిన ఈ వేడుకలో చాలామంది భావోద్వేగానికి గురయ్యారు. పౌరసత్వం వచ్చినట్లు ప్రకటించగానే వారి కళ్లలో ఆనందబాష్పాలు రాలాయి. “నవ్వుకోండి, ఇకపై మీరందరూ అధికారికంగా భారతీయులే” అంటూ డిప్యూటీ సీఎం వారికి అభినందనలు తెలిపారు. ప్రధాని నరేంద్ర మోడీ తీసుకున్న కీలక నిర్ణయం, పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) వల్లే ఇది సాధ్యమైందని ఆయన స్పష్టం చేశారు.
ఈ చట్టం ద్వారా శరణార్థుల జీవితాల్లో భద్రత, ఆశలు చిగురించాయని హర్ష్ సంఘ్వీ తెలిపారు. పాకిస్థాన్‌లో హిందూ కుటుంబాలు, ముఖ్యంగా మహిళలు పడుతున్న ఇబ్బందులు అన్నీఇన్నీ కాదన్నారు. పాక్‌లోని థార్పార్కర్ ప్రాంతం నుంచి భారత్‌కు వచ్చిన ఎంతోమంది మహిళలు తమ ప్రాణాలను కాపాడుకోవడానికి పేర్లు కూడా మార్చుకోవాల్సి వచ్చిందని గుర్తుచేశారు. ఇప్పుడు భారతీయ పౌరసత్వం రావడంతో వారు ఎవరికీ భయపడకుండా తమ అసలు పేర్లతో ఆత్మగౌరవంతో బతకవచ్చని చెప్పారు. పౌరసత్వం పొందిన 319 మందిలో రాజ్‌కోట్ జిల్లాకు చెందిన వారు 259 మంది ఉండగా, మోర్బీ నుంచి 53 మంది, కచ్ నుంచి 6 మంది, సురేంద్రనగర్ నుంచి ఒకరు ఉన్నారు. పాకిస్థాన్ పాస్‌పోర్ట్ కంటే.. రాజ్‌కోట్ గర్బా ఉత్సవాల్లో పాల్గొనేందుకు లభించే అనుమతి పత్రమే తనకు ఎంతో విలువైనదని ఈ సందర్భంగా హర్ష్ సంఘ్వీ వ్యాఖ్యానించారు. దేశంలో స్థిరమైన గుర్తింపు, రక్షణ కోసం ఏళ్లుగా ఎదురుచూస్తున్న ఈ కుటుంబాలకు ఈ రోజు ఎంతో ప్రత్యేకమైనది. పౌరసత్వం దక్కడంపై వారు స్పందిస్తూ.. ఇది తమ కల నిజమైన క్షణమని చెప్పారు. ఇకపై తమకంటూ ఆధార్ కార్డు, ఓటరు ఐడీ వస్తాయని, రాబోయే ఎన్నికల్లో ఓటు వేసే హక్కు లభిస్తుందని ఆనందం వ్యక్తం చేశారు. అలాగే ఇల్లు కొనుగోలు చేయడానికి బ్యాంకుల్లో రుణాలు కూడా పొందవచ్చని సంతోషంగా తెలిపారు.
Also Read
- Pappu Chakodilu: స్వీట్ షాప్ స్టైల్ క్రిస్పీ 'పప్పు చకోడీలు'.. ఇంట్లోనే పర్ఫెక్ట్గా సులువుగా ఇలా తయారు చేసుకోండి.!
- Parliament Special Sessions: పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలకు ప్లాన్?.. డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ బిల్లులపై కసరత్తు
- How to Store Fashion Jewellery: మీ ఫ్యాషన్ జ్యువెలరీ నల్లగా మారుతున్నాయా? ఈ సింపుల్ చిట్కాలతో మెరిపించండి!
- Municipal Elections 2026: నేటి నుంచే మున్సిపల్ ఎన్నికల నామినేషన్లు.. మూడు రోజులే గడువు!
తాజావార్తలు
-
Gujarat: పాకిస్థాన్‌కు చెందిన 319 మందికి భారత పౌరసత్వం.. శరణార్థుల కన్నీటి పర్యంతం..
-
Pappu Chakodilu: స్వీట్ షాప్ స్టైల్ క్రిస్పీ ‘పప్పు చకోడీలు’.. ఇంట్లోనే పర్ఫెక్ట్గా సులువుగా ఇలా తయారు చేసుకోండి.!
-
Parliament Special Sessions: పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలకు ప్లాన్?.. డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ బిల్లులపై కసరత్తు
-
IPL 2027: ఢిల్లీ క్యాపిటల్స్‌కు బిగ్ షాక్.. ఐపీఎల్ 2027 ముందే స్టార్ ప్లేయర్ అవుట్.. ఇక కష్టమే!
-
How to Store Fashion Jewellery: మీ ఫ్యాషన్ జ్యువెలరీ నల్లగా మారుతున్నాయా? ఈ సింపుల్ చిట్కాలతో మెరిపించండి!
ట్రెండింగ్
-
కారుతో రోడ్డుపైనే కాదు, గాల్లోనూ ప్రయాణం.! Elon Musk సంచలన డెమో.. గాల్లోకి దూసుకెళ్లిన Tesla Roadster..
-
డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, పెర్ఫార్మన్స్.. ఐఫోన్ నుంచి గెలాక్సీ వరకు.. బెస్ట్ Foldable Phones ఇవే..!
-
కేవలం 25 కార్లే.. వచ్చీ రాగానే సేల్ అవుట్.! Jeep Wrangler Whitecap Mojito లాంచ్..
-
Water Can Cleaning: 20 లీటర్ల నీళ్ల క్యాన్‌ను ఇలా కడుగుతున్నారా? ఈ తప్పులు వద్దు.!
-
Upma Rava vs Idli Rava : ఉప్మా రవ్వ, ఇడ్లీ రవ్వ ఒకటి కాదు.. అసలు తేడా ఇదే!