NTV Telugu Site icon

Shoaib Akhtar: టీమిండియా ముందు పాక్ ఓ చిన్న పిల్లల జట్టులా కనిపించింది..

Akthar

Akthar

Shoaib Akhtar: పాకిస్తాన్ మాజీ క్రికెటర్ షోయబ్ అక్తర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. శనివారం జరిగిన మ్యాచ్ లో తమ జట్టును అన్ని రకాలుగా చిత్తు చేసిందని తెలిపాడు. పాక్ ను కోలుకోలేని దెబ్బ కొట్టిందని కీలక వ్యాఖ్యలు చేశాడు. అంతేకాకుండా.. టీమిండియా ముందు పాకిస్తాన్ జట్టు ఓ చిన్న పిల్లల జట్టులా కనిపించిందని విమర్శలు చేశాడు. పాక్ అంత దారుణంగా ఓడిపోతుందని తాను అనుకోలేదని చెప్పాడు.

Read Also: Cyber Crime: ఒక ఫ్లాట్‌, ఇద్దరు యువకులు, 84 బ్యాంకు ఖాతాలు, రూ.854 కోట్ల మోసం..!

ఈ వరల్డ్ కప్ లో టీమిండియా మంచిగా ఆడుతుందని కితాబిచ్చాడు. సరైన పంథాలో వెళుతోందని.. సెమీఫైనల్ అడ్డంకి దాటితే వరల్డ్ కప్ టీమిండియాదేనని అక్తర్ తెలిపాడు. 2011 నాటి ఫలితాన్ని టీమిండియా పునరావృతం చేయడం ఖాయంగా కనిపిస్తోందని ఆయన వెల్లడించాడు. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో టీమిండియా బలంగా ఉందని.. ఇలానే తమ ఫాంను కంటిన్యూ చేయాలని చెప్పుకొచ్చాడు.

Read Also: World Cup 203: వరల్డ్‌కప్‌ సెమీఫైనల్లో ఇంగ్లండ్‌ ఉంటుందన్న ఇంగ్లిష్‌ మాజీ కెప్టెన్‌.. కౌంటరిచ్చిన భారత దిగ్గజం

ఇక మొన్న(శనివారం)సొంతగడ్డపై జరిగిన వరల్డ్ కప్ మ్యాచ్ లో భారత జట్టు పాకిస్థాన్ పై ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. మొదటగా బౌలింగ్ చేసిన భారత్.. పాకిస్థాన్ ను 191 పరుగులకే ఆలౌట్ చేసింది. ఆ తర్వాత బరిలోకి దిగిన టీమిండియా టార్గెట్ ను ఫినిష్ చేసి అద్భుత విజయాన్ని అందుకుంది. దీంతో వరల్డ్ కప్ లో హ్యాట్రిక్ విజయం నమోదు చేసుకుంది.