Pakistan: యుద్ధ భయంతో పాకిస్థాన్ అగ్రనాయకత్వం విదేశాలకు పారిపోయినట్లు పలు కథనాలు వస్తున్నాయి. ప్రస్తుతం దాయాది దేశం అగ్ర నాయకత్వం సౌదీ అరేబియాలో ఉంది. పాక్ ప్రధాన మంత్రి షాబాజ్ షరీఫ్ రియాద్‌లో జరుగుతున్న ఫ్యూచర్ ఇన్వెస్ట్‌మెంట్ ఇనిషియేటివ్ (FII9) సమావేశంలో పాల్గొంటున్నారు. అలాగే ఆయన సౌదీ అగ్ర నాయకత్వంతో అనేక ద్వైపాక్షిక సమావేశాలను కూడా నిర్వహించే ఛాన్స్ ఉన్నట్లు సమాచారం. ఇదే సమయంలో సౌదీ అరేబియా నుంచి కొన్ని వందల మైళ్ల దూరంలో ఉన్న జోర్డాన్‌లో పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ ఫీల్డ్ మార్షల్ అసిమ్ మునీర్ ఉన్నారు. బంగ్లాదేశ్‌లో దాయాది దేశ మిలిటరీ నంబర్ 2 మీర్జా షంషాద్ బేగ్ దౌత్యం చర్చల పేరుతో పర్యటిస్తున్నారు.
READ ALSO: Baahubali The Epic : ఆ సీన్ నాకు ఎప్పటికీ స్పెషల్.. రాజమౌళి, ప్రభాస్ ఇంటర్వ్యూ..
ఈ ముగ్గురు అధికారులు ప్రస్తుతం ఇస్తాంబుల్‌పై దృష్టి సారించారు. అక్కడ పాకిస్థాన్ పొరుగు దేశమైన ఆఫ్ఘనిస్థాన్‌ను శాంతింపజేయడానికి రెండు రోజులుగా చర్చలు జరుపుతోంది. వాస్తవానికి ఇప్పుడు దాయాది అగ్ర నాయకత్వం దేశం బయట ఉంది. అక్టోబర్ 2025లో కాబూల్, కాందహార్‌లలో పాకిస్థాన్ వైమానిక దాడులు ప్రారంభించినప్పుడు ఆఫ్ఘనిస్థాన్-పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకున్నాయి. దీనికి ప్రతిస్పందనగా ఆఫ్ఘన్ తాలిబన్లు పాకిస్థాన్ సరిహద్దు పోస్టులపై దాడి చేసి, డజన్ల కొద్దీ సైనికులను చంపారు. చివరికి ఖతార్, తుర్కియే మధ్యవర్తిత్వంతో రెండు దేశాల మధ్య కాల్పుల విరమణ కుదిరింది.
కానీ ఈ రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు ఇప్పటికి అలాగే ఉన్నాయి. ఏ క్షణంలోనైనా ఇరు దేశాల మధ్య యుద్ధం చెలరేగవచ్చు. తెహ్రిక్-ఎ-తాలిబన్ 2025లో పాకిస్థాన్‌లో 600 కంటే ఎక్కువ దాడులను చేసింది. ఈ దాడుల వల్ల దాయాది దేశంలో అంతర్గత భద్రతకు ముప్పు కలుగుతుందని పాక్ అధికారులు వెల్లడించారు. అందువల్ల పాకిస్థాన్ ఏ విధంగానైనా ఆఫ్ఘనిస్తాన్‌తో శాంతిని కోరుకుంటుంది. సోవియట్ రష్యా, అమెరికాపై ఇప్పటికే దెబ్బ కొట్టిన తాలిబన్లు, పాకిస్థాన్‌ను నాశనం చేయాలనుకుంటున్నారని పాక్ అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పాకిస్థాన్ విదేశాంగ విధానం బహుళ-ముఖ సమతుల్యతపై దృష్టి సారించింది. ఇందులో భాగంగా దాని పశ్చిమ సరిహద్దులో భద్రతను బలోపేతం చేయడం, ఆర్థిక సంక్షోభాన్ని పరిష్కరించడం, దక్షిణాసియాలో పాకిస్థాన్ ప్రభావాన్ని విస్తరించడం వంటి వ్యూహాలు ఉన్నాయి. పాకిస్థాన్ నాయకుల ఈ పర్యటనలు, ప్రయత్నాలు అందులో భాగమే అని విశ్లేషకులు చెబుతున్నారు. ఆఫ్ఘన్ ఉద్రిక్తతల వల్ల ఏర్పడిన అనిశ్చితి మధ్య పాకిస్థాన్ ప్రత్యామ్నాయ పొత్తులను బలోపేతం చేయడానికి ప్రయత్నిస్తుందని వాళ్లు అభిప్రాయం వెల్లడించారు.
ఉద్రిక్తతల నేపథ్యంలో పాకిస్థాన్ అరబ్ ప్రాంతంలో తన ప్రధాన భాగస్వామి అయిన సౌదీ అరేబియాపై ఎక్కువగా ఆశలు పెట్టుకుంది. పాక్ ప్రధాన మంత్రి షాబాజ్ షరీఫ్ గత మూడు నెలల్లో మూడుసార్లు సౌదీ అరేబియాను సందర్శించారు. ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్‌లలో ఆయన సౌదీలో పర్యటించారు. ఆయన ఆఫ్ఘన్ యుద్ధంతో పాకిస్థాన్‌కు సౌదీ భద్రతా హామీలను కోరుతున్నారు. ఇదే సమయంలో పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ ఫీల్డ్ మార్షల్ అసిమ్ మునీర్ జోర్డాన్ రాజు అబ్దుల్లా II, జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ ఛైర్మన్ మేజర్ జనరల్ యూసుఫ్ హునైటితో సైనిక సహకారం గురించి చర్చించారు. జోర్డాన్ – పాకిస్థాన్ మధ్య సహకారాన్ని పెంచడం గురించి ఇద్దరూ చర్చించినప్పటికీ, దక్షిణాసియా వ్యూహాత్మక దృశ్యం ఈ సమావేశంలో ముఖ్యమైన అంశంగా మారిందని విశ్లేషకులు చెబుతున్నారు. అలాగే పాకిస్థాన్ సైన్యంలో నంబర్ టూ జనరల్ సాహిర్ షంషాద్ మీర్జా.. తాజాగా బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వ అధిపతి ముహమ్మద్ యూనస్‌తో సమావేశమయ్యారు. ఈ ఇద్దరు నాయకులు ఇరుదేశాల వ్యూహాత్మక అంశాలపై చర్చించినట్లు సమాచారం.
READ ALSO: Justice Surya Kant: తదుపరి సీజేఐగా జస్టిస్ సూర్యకాంత్.. !