పంజాబ్ సరిహద్దుల్లో సరిహద్దు భద్రతా దళం ఇవాళ (శుక్రవారం) జరిపిన కాల్పుల్లో పాకిస్థాన్ చొరబాటుదారుడిని హతమార్చారు. పాక్ సరిహద్దుల్లో చొరబాటుదారుడి కదలికలు పనిగట్టిన బీఎస్ఎఫ్ జవాన్లు.. వారిపై కాల్పులు జరిపినట్లు అధికారులు వెల్లడించారు. చొరబాటుదారులు సరిహద్దు కంచెకు దగ్గరగా వెళ్లడంతో సైనికులు వారిపై కాల్పులు జరిపారు.
Read Also: Chiru: భోళా మేనియాలో ‘ఆదిపురుష్’ ట్రెండ్!
పంజాబ్‌లోని తార్న్ తరన్‌లోని భారత్-పాకిస్తాన్ సరిహద్దులో చొరబాటుకు యత్నించిన పాకిస్తాన్ వ్యక్తులను బీఎస్ఎఫ్ జవాన్లు కాల్చి చంపారు. పాకిస్థాన్‌కు చెందిన ఇద్దరు గుర్తుతెలియని చొరబాటుదారులను బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ హతమార్చింది. వారు భారత భూభాగంలోకి ప్రవేశించి ఈ నెల మే నెలలో భారతదేశం-పాకిస్థాన్ సరిహద్దుకు దగ్గరగా మూడు ప్యాకేట్ల నిషేదిత వస్తువులను స్వాధీనం చేసుకున్నాట్లు చెప్పారు. అదే నెలలో పంజాబ్‌లోని అంతర్జాతీయ సరిహద్దు సమీపంలో ఒక పాకిస్థానీ జాతీయుడిని బీఎస్ఎఫ్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.
Read Also: Vishal Marriage: అమ్మాయిల వ్యక్తిగత జీవితాన్ని నాశనం చేస్తున్నారు.. పెళ్లిపై స్పందించిన విశాల్!
పంజాబ్ ఫ్రాంటియర్‌లోని బీఎస్ఎఫ్ సైనికులు సరిహద్దు దాటి పంపిన 22 డ్రోన్‌లను హస్తగతం చేసుకున్నారు. ఇటీవల కూడా భారత్ లోకి ఇద్దరు పాకిస్థాన్ చొరబాటుదారులు వచ్చేందుకు ప్రయత్నించగా.. వారిని బీఎస్ఎఫ్ జవాన్లు కాల్చి చంపేశారు. ఇక, 2022 ఏడాదిలో 316 కిలోగ్రాముల డ్రగ్స్‌ను సరిహద్దు భద్రతా సిబ్బంది స్వాధీనం చేసుకుంది. వేర్వేరు సంఘటనల్లో 23 మంది పాకిస్థాన్ పౌరులను భారత ఆర్మీ అదుపులోకి తీసుకుంది. భారత్- పాకిస్థాన్ సరిహద్దు ప్రాంతాల్లో ఇండియన్ ఆర్మీ పటిష్టమైన గస్తీ కాస్తుండటంతో పాటు పాక్ చేసే కుట్రలను వెంటనే తిప్పి కొట్టడంతో సక్సెస్ అయింది. పాక్ నుంచి చొరబాటుదారులను ఎట్టి పరిస్థితిలోనూ భారత్ లోకి రాకుండా తగిన చర్యలు తీసుకుంటున్నామని బీఎస్ఎఫ్ అధికారులు వెల్లడించారు.
